AP Elections వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే పంచ్.. భార్యతో కలిసి పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేశారంటే?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానం చెప్పారు. గత కొన్ని నెలలుగా నాలుగో పెళ్లి అంటూ వైఎస్ జగన్ తన హోదాకు దిగజారి చేసిన ఆరోపణలకు పవర్ స్టార్ తనదైన రీతిలో షాక్ ఇచ్చారు. తన భార్యతో కలిసి ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కును ఉపయోగించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్న వారి నోరు మూయించారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఏపీలో అక్రమాల గురించి పవన్ అడిగే సమాధానం చెప్పడం మానేసి..ఆయన పెళ్లిళ్ల గురించి మీటింగ్‌లో ప్రస్తావించడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో పెళ్లి అంటూ పదే పదే మీటింగుల్లో చెప్పడంతో అసహనానికి గురైన జనసేన చీఫ్ నువ్వే నా నాలుగో పెళ్లాం అంటూ కామెంట్ చేయడం వైరల్ అయింది.

అయితే చివరకు పిఠాపురంలో చివరి పబ్లిక్ మీటింగ్‌లో కూడా పవన్ కల్యాణ్ ప్రతీ ఐదేళ్లకు కార్లను మార్చినట్టు ఆయన పెళ్లాలను మార్చుతాడు అంటూ ఆవేశంగా మాట్లాడారు. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా.. ఆయన చేసిందేమీ లేదు అంటూ ఆరోపణలు చేశాడు. తన నాలుగో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, మే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజనోవా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంగళగిరికి చేరుకొన్నారు. లెజెనోవాకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. శాలువాను బహుకరించి ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

హెలికాప్టర్‌లో వచ్చిన పవన్ కల్యాణ్ దంపతులు హెలిప్యాడ్ వద్ద శాలువాలు కప్పుకొని ఫోటోకు ఫోజిచ్చారు. తన పెళ్లిళ్లపై కామెంట్లు చేస్తున్న వారికి ఘాటుగా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దని పదే పదే చెప్పినప్పటికీ.. అధికార పార్టీ నేతలు మాత్రం దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై పవన్ పలుమార్లు ఆవేశంగా వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, తన భార్య అన్నా లెజోనోవాతో కలిసి పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మంగళగిరిలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కాలనీలోని సహకార సంఘం కార్యాలయంలో సాధారణ పౌరుడిగా ఓటు వేశారు. అనంతరం ఓటింగ్ సరళిని తన నేతలతో కలిసి అంచనావేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకొంటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











