Bheemla Nayak: అజ్ఞాతవాసి అప్పుని చక్ర వడ్డీతో సహా తీర్చేయడం పక్కా.. బాక్సాఫీస్ మాస్ జాతర!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తాయి. అయితే కొన్నిసార్లు అంచనాలు భారీగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద నష్టాలు కూడా వచ్చాయి. అందులో ప్రధానంగా అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బ ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేరు. చాలా నిరుత్సాహ పడ్డారు. కానీ ఈసారి భీమ్లా నాయక్ సినిమాతో మాత్రం పవర్ స్టార్ అజ్ఞాతవాసి అప్పుని తీర్చేస్తాడు అని చెప్పవచ్చు. ఇక భీమ్లాను చూసిన ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా రావచ్చు అనే వివరాలపై ఒక లుక్కేస్తే..

ఆ సినిమా కొట్టిన దెబ్బ..

ఆ సినిమా కొట్టిన దెబ్బ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారాలని అనుకున్న సమయానికి చివరగా ఒప్పుకున్న సినిమా అజ్ఞాతవాసి. అది కూడా త్రివిక్రమ్ మీద నమ్మకంతోనే ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా కాపీ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను మిగిల్చింది. ఫ్యాన్స్ కూడా సినిమాను చూసి ఏ కోణంలో కూడా సంతృప్తి చెందలేకపోయారు.

చాలా బాకీ పడ్డారు

చాలా బాకీ పడ్డారు

అజ్ఞాతవాసి సినిమా కొట్టిన దెబ్బను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఓపెనింగ్స్ తోనే ఓల్డ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న లిస్టులో ఆ సినిమా కనిపిస్తూనే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ ఫ్యాన్స్ కు చాలా బాకీ పడ్డాడు అనే చెప్పాలి.

భీమ్లా.. కడుపు నింపేసింది

భీమ్లా.. కడుపు నింపేసింది

ఇక త్రివిక్రమ్ మొత్తానికి భీమ్లా నాయక్ సినిమాతో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా చేశాడు. అజ్ఞాతవాసి సినిమా తరువాత పింక్ రీమేక్ వకీల్ సాబ్ అంతగా హిట్ అవ్వలేదు. ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. కానీ ఈసారి భీమ్లా నాయక్ మాత్రం మాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ లో కడుపు నింపేసింది. ఎక్కడా తగ్గకుండా రానా పాత్రతో సినిమాకు ఒక సరికొత్త రూపం కూడా తీసుకు వచ్చారు.

 అప్పుడు నష్టపోయిన వారికి..

అప్పుడు నష్టపోయిన వారికి..

ఇక పవన్ అజ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయిన బయ్యర్లు కూడా ఉన్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమాతో కొంతవరకు అలాంటి వారికి అప్పులు తీర్చేలా సినిమా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలతో నష్టాలు ఎదుర్కొన్న బయ్యర్లకు భీమ్లా హక్కులను రీజనబుల్ రేట్లకు అమ్మేసి ఆ తరువాత లాభాల్లో వాటా తీసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో రాజకీయాలు..

ఏపీలో రాజకీయాలు..

ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల కారణంగా అక్కడ టికెట్ల రేట్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టి మరి సినిమాలను నడిపిస్తుండడం విశేషం. ఏసీ థియేటర్స్ లలో 10 రూపాయలు, 20 రూపాయలు ఉండడం చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి టికెట్ల రేట్లతో లాభాలు కాదు కదా.. కనీసం థియేటర్ మెయింటేనేన్స్ కు కూడా సరిపడా కలెక్షన్స్ రావని థియేటర్స్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. ఇక ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్ కు పవన్ ముందుగానే భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా చాలా వరకు ఏరియా హక్కులను తగ్గించినట్లు టాక్.

మొదట రోజు కలెక్షన్స్ ఎంత రావచ్చు?

మొదట రోజు కలెక్షన్స్ ఎంత రావచ్చు?

ఇక భీమ్లా నాయక్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరోజు ముందు వచ్చిన బూకింగ్స్ ని బట్టి చూస్తే 27కోట్లకు పైగానే వసూళ్లు రావచ్చట. ఇక సినిమాకు మంచి టాక్ వస్తోంది కాబట్టి 30కోట్లు కూడా అందుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా అజ్ఞాతవాసి కలిగించిన గాయాన్ని భీమ్లా మందుతో అందరికి నయం అవుతుంది అని తెలుస్తోంది. మరి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో మొదటిరోజు వచ్చే అఫీషియల్ కలెక్షన్స్ బట్టి ఒక క్లారిటీ వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X