Bheemla Nayak First Glimpse: లుంగీలో పవర్ స్టార్ హై వోల్టేజ్ యాక్షన్.. బయటకు రారా నా కొడకా అంటూ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ అప్డేట్ రానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ఒకటి. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా అనంతరం మళ్లీ అలాంటి హై వోల్టేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించలేదు.

ఇక ప్రస్తుత వాతావరణం చూస్తుంటే గబ్బర్ సింగ్ లాంటి హిట్ పడటం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు టైటిల్ ను కూడా విడుదల చేశారు. ఇక మొత్తానికి అందరూ అనుకున్నట్లుగానే సినిమాకు భీమ్లా నాయక్ టైటిల్ ఫిక్స్ చేశారు.

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్‌

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్‌

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్‌ కోసం హార్డ్ కోర్ అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి పవర్ స్టార్ అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నారు. సినిమాలో రానా డానియెల్ శేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పవర్ స్టార్ రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా అంటూ విలన్స్ ను చితకొట్టేశాడు. ఇక దానికి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. లుంగీలో పవర్ స్టార్ కటౌట్ కూడా అదిరింది. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయితేనే పవర్ స్టార్ అభిమానుల్లో ఒక రేంజ్ లో సందడి ఉంటుంది. ఇక అలాంటిది ఫస్ట్ గ్లింప్స్‌ రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా పవర్ స్టార్ మ్యానియా కనిపిస్తోంది. మొన్నటి వరకు కూడా మహేష్ బాబు అభిమానుల హడావిడి కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పవర్ స్టార్ ఫాన్స్ సరికొత్తగా పవన్ కళ్యాణ్ పేరును ట్రెండింగ్ లిస్ట్ లో చేర్చారు.

పవర్ఫుల్ రోల్స్

పవర్ఫుల్ రోల్స్

మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు పోటీగా మరొక ముఖ్యమైన పాత్రలో దగ్గుబాటి నటిస్తున్న విషయం తెలిసిందే. అతని పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొనసాగే సన్నివేశాలు హై వోల్టేజ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దర్శకుడి పై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

పోటాపోటీగా రానా పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు ఎంతో ఇష్టంగా మాటలను అందిస్తున్నారు యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తనదైన శైలిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ఇద్దరు కూడా పోటాపోటీగా నటించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ లో వచ్చిన డైలాగ్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ టీజర్ అదిరిపోయింది అని బాక్సాఫీసు రికార్డులు కూడా బద్దలు కావడం ఖాయమని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

త్వరలోనే మొదటి పాట

త్వరలోనే మొదటి పాట

త్వరలోనే బీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న 50వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే ఇక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు తప్పకుండా ఆ సినిమా ప్రేక్షకులలో మరింత అంచనాలను పెంచడం ఖాయమని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే ఇదివరకు వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన థమన్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రేమతో అద్భుతమైన పాటలను కంపోజ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Recommended Video

Hari Hara Veera Mallu Glimpse Review.. కంటెంట్ + క్వాలిటీ !!
త్వరలో మరిన్ని అప్డేట్స్..

త్వరలో మరిన్ని అప్డేట్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక విభిన్నమైన సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా హరహర వీరమల్లు మేకింగ్ వీడియో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవర్ స్టార్ పుట్టిన రోజున సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పై సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడు అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో ఆ సినిమా అప్డేట్స్ అయితే రాకపోవచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X