twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak: ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందంటే.. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. లిరిక్స్ మాములుగా లేవు!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రాబోతున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడంతో ఈ పుట్టినరోజు ప్రత్యేకమైన సందడి కనిపించబోతోంది. ఇక అందరి ఫోకస్ కూడా భీమ్లా నాయక్ మొదటి సాంగ్ పైన ఉంది. ఇక తమన్ సంగీత సారధ్యంలో కంపోజ్ చేసిన మొదటి పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. ఇక ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాలకు సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు క్లారితో ఇచ్చేశారు.

    చాలా పవర్ ఫుల్ గా..

    చాలా పవర్ ఫుల్ గా..

    ఇక పాటకు సంబంధించిన లిరిక్స్ ను షీట్ ను ఒక రోజు ముందుగానే విడుదల చేశారు. పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన ప్రతి పదం కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా లైన్స్ హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మరోసారి తమన్ తన అభిమానాన్ని చూపించుకునే అవకాశం కూడా వచ్చింది. మొదట ఈ పాట స్లోగా మొదలై ఆ తర్వాత ఫాస్ట్ బీట్ తో అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని తెలుస్తోంది.

    లిరిక్స్ మామూలు గా లేవు

    లిరిక్స్ మామూలు గా లేవు

    ఇదివరకే థమన్ ఫస్ట్ లుక్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చితకొట్టిన విషయం తెలిసిందే. ఇక మొదటి పాటను ఏ రేంజ్ లో కంపోజ్ చేసి ఉంటాడో ఊహలకు అందడం లేదు. లిరిక్స్ చూస్తుంటే ఈ పాట హిట్ అవ్వడం ఖాయమని అనిపిస్తోంది. 'శభాష్.. ఆడగదు ఈడకాదు అమరోళ్ల మేడా కాదు.. అనే లైన్స్ తో మొదలు కానుంది. ముందుగా క్యారెక్టర్ పుట్టుక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను వివరించి ఆ తరువాత అతని స్వభావం, బలం గురించి చక్కగా వివరించినట్లు ఉంది.

     నిమ్మళంగా కనపడే నిప్పుకొండ

    నిమ్మళంగా కనపడే నిప్పుకొండ

    భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడీ ఫైరు సల్లగుండ, ఖాకీ డ్రెస్సు పక్కనపెడితే వీడే పెద్ద గుండా. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ. ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా... అంటూ సాగే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలాన్ని గట్టిగానే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ లిరిక్స్ ను రాశారు. చూస్తుంటే మొదటి సాంగ్ తోనే సినిమాపై మరింత హై రేంజ్ లో బజ్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్థమవుతోంది.

    హై వోల్టేజ్ కాంబినేషన్

    హై వోల్టేజ్ కాంబినేషన్

    మలయాళం బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరొక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్యలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి అని తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారు. ఇక సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో నాగ వంశీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి పోటీగా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ ను భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మరి ఆ పోటీలో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Pawan kalyan Bheemla Nayak first song lyrics sheet,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X