హిందీలో డైరెక్ట్ గా విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ సినిమా.. తొలిసారిగా అలా భారీ స్థాయిలో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం మెగా అభిమానులకు మాత్రమే కాకుండా మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే చాలామంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంక్రాంతికే కూడా రావాల్సింది. కానీ మిగతా సినిమాల కారణంగా అలాగే ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా
మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అంతేకాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.. ఇక ఇప్పటికే తమన్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా మంచి మ్యూజిక్ కూడా అందించాడు. యూట్యూబ్ లో విడుదలైన పాటలు అన్నీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

తరువాత ట్రైలర్ కూడా
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ లో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో అయితే నిర్మాత నాగ వంశీ చాలా చురుగ్గా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై చాలా అప్డేట్స్ ఇచ్చినట్లు చెప్పిన నిర్మాత నాగ వంశీ ఇక నెక్స్ట్ అయితే డైరెక్ట్ గా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

హిందీలో కూడా భీమ్లా నాయక్
అంతేకాకుండా మొదటిసారి హిందీ లో పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇదివరకే పుష్ప సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకునే టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక ఈ రోజు ఖిలాడి సినిమా కూడా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీగానే విడుదల చేశారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా హిందీ మార్కెట్లోకి తీసుకు వెళ్ళబోతున్నట్లుగా వివరణ ఇచ్చారు.

రానా, పవన్ క్రేజ్..
తప్పకుండా ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. రాణా దగ్గుబాటి ఇదివరకే హిందీ ఆడియన్స్ కు బాగా తెలుసు. అతను నటించిన బాహుబలి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా రానా దగ్గుబాటి అప్పుడప్పుడు మంచి అవకాశాలు వచ్చినప్పుడు హిందీలో కూడా నటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా యూట్యూబ్ లో అయితే వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు బిమ్లా నాయక్ సినిమాలను అదే నమ్మకంతో బాలీవుడ్ వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నారు. మరి సినిమా అక్కడ ఏ స్థాయిలో విజయాన్ని విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











