హిందీలో సాలీడ్ ధరకు అమ్ముడైన భీమ్లా నాయక్.. ఆ సెంటిమెంట్ తో భారీగా రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ పై అంచనాలు రోజురోజుకు గట్టిగానే పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరుతోంది. ఇక ప్రస్తుతం హిందీ మార్కెట్లో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ ను బట్టి నార్త్ లో భారీగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక బడా సంస్థ భారీ ధరకు భీమ్లా నాయక్ హిందీ థియేట్రికల్ రిలీజ్ కొనుగోలు ఉన్నట్లు సమాచారం. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాపై నమ్మకం..
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ లో యువ నిర్మాత నాగవంశి భారీ బడ్జెట్తో నిర్మించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు ప్రత్యేకంగా డైలాగ్స్ అందించగా యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారు.

ఆఫర్స్ కు టెంప్ట్ అవ్వకుండా
భీమ్లా నాయక్ సినిమాకు మధ్యలో చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు కూడా 80 కోట్లకు పైగానే ఓటి హక్కుల కోసం ఆఫర్ చేసినట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఇక నిర్మాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎంత ఆలస్యం అయినా కూడా ఓటీటీ ఆఫర్స్ కు టెంప్ట్ అవ్వలేదు.

పవన్ విశ్వరూపం
మొత్తానికి ఈ సినిమా షూటింగ్ అయితే ఇటీవల పూర్తయింది. ఇక సినిమాకు సంబంధించిన చాలా అప్డేట్స్ కూడా వచ్చేశాయి. ఇక వీలైనంత త్వరగా మొదటి ట్రైలర్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారు అని కూడా నిర్మాత నాగవంశీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతేకాకుండా రానా దగ్గుబాటి పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పాత్ర తో సమానంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని తెలియజేశారు.

హిందీలో భారీగా..
ఇక ఈ సినిమాను హిందీలో కూడా భారీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. B4U అనే ప్రముఖ బాలీవుడ్ సంస్థ భీమ్లా నాయక్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీగా విడుదల చేయాలని మొదటి నుంచి నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమా నార్త్ లో భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఆ సెంటిమేంట్ తోనే భీమ్లా నాయక్ సినిమాను కూడా భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే?
అసలైతే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చాలా ట్రై చేశారు. కానీ వివిధ కారణాల వలన వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించేలా లేవని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. లేదంటే సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతామని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మరి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











