Bheemla Nayak: అనుకున్నట్లే అయ్యింది.. సినిమాలో ఆ ఒక్కటి లేపేశారు.. కావాలనే అలా..

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ మొత్తానికి ప్రీమియర్ షోలతో హంగామా స్టార్ట్ చేసింది. యూఎస్ లో సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా అంతా బాగానే ఉంది. అయితే ఇన్ని రోజులు సినిమాలో ఉందని అనుకుంటున్న ఒక దాన్ని ఎడిట్ లో లేపేశారు. ఆ ఒక్కటి సినిమాకు అంతగా ప్లస్ అవ్వదని అనుకున్నారట. ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి? ఎందుకు కట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే..

 ఫెస్టివల్ మొదలైంది

ఫెస్టివల్ మొదలైంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక పండగ వాతావరణం నెలకొంది. అసలైతే సంక్రాంతి హడావుడిలోనే భీమ్లా నాయక్ సినిమా విడుదల కావాల్సింది. కానీ అప్పుడు అనేక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా ఫస్ట్ లుక్ నుంచి సాంగ్స్ ట్రైలర్ వరకు అన్ని కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి.

మేజర్ ప్లస్ పాయింట్

మేజర్ ప్లస్ పాయింట్

ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో థమన్ ఎలాంటి మ్యూజిక్ చేసినా కూడా ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. థియేటర్స్ లో కూడా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచిందని కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.

 సాలీడ్ బుకింగ్స్

సాలీడ్ బుకింగ్స్

మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు. విడుదలకు ముందు విడుదల చేసిన సెకండ్ ట్రైలర్ కూడా అంచనాల డోస్ ను మరింత పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ వేడుక ద్వారా కూడా హైప్ మరింత ఎక్కువైంది. అంతకుముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉండగా ట్రైలర్ అనంతరం హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆరు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

అంతకుమించి.. విజిల్స్

అంతకుమించి.. విజిల్స్



సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అన్ని విషయాల్లోనూ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే అందరూ కూడా అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా చూశారు. ఇక ఆ సినిమా రేంజ్ లో భీమ్లా నాయక్ ఆకట్టుకుంటుందా లేదా అనే అనుమానంలో భీమ్లా అంతకుమించి అనేలా విజిల్స్ వేయించింది.

ఆ ఒక్కటి కట్ చేసి..

ఆ ఒక్కటి కట్ చేసి..

ఇక సినిమాలో ఒకటి మాత్రం ఎడిటింగ్లో తీశారు అని తెలుస్తోంది. అంత ఇష్టం.. అనే పాట సినిమా స్పీడ్ కు బ్రేక్ వేస్తుందని దర్శకుడు సాగర్ అలాగే త్రివిక్రమ్ కూడా నిర్ణయం తీసుకొని ఆ పాటను ఏడిటింగ్ లో లేపేశారు. విడుదలకు ముందే ఈ పాటను ఎడిట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది.

కావాలని తీసేశారట..

కావాలని తీసేశారట..

భీమ్లా నాయక్, డానియెల్ శేఖర్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్న సమయంలో ప్రతీ సన్నివేశంలో వాళ్ళే హైలెట్ అయ్యారు. ఇక ఈ మధ్యలో ఉండే పాత్రలు వారిని ఏ మాత్రం డామినేట్ చేసింది లేదు. ఇక మధ్యలో అంత ఇష్టం పాట కూడా సినిమా స్పీడ్ లో అడ్డుగా ఉందని కావాలని తీసేశారట. ఇక సినిమా చూశాక అందరూ ఆ పాట రావాల్సిన అవసరం లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X