Bheemla Nayak Trailer: హై వోల్టేజ్ యాక్షన్.. తోలు తీస్తా నా కొడకా అంటూ పవర్ స్టార్ - రానా వార్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది అనే చెప్పాలి. ఇక ట్రైలర్ ఎలా ఉంది అని వివరాల్లోకి వెళితే..

హై వోల్టేజ్ ట్రైలర్
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో రానా దగ్గుబాటి దానియెల్ శేఖర్ పాత్రలలో నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వారి క్యారెక్టర్లకు తగ్గట్టుగా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరి లో కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలను అమాంతం పెంచేసింది.

త్రివిక్రమ్ ఆలోచనలతో
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా తప్పకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ తన ఆలోచనతోనే తెర పైకి వచ్చేలా చేశాడు. ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా ఫినిష్ అయ్యాయి.

అనుకున్న సమయనికి ట్రైలర్
అసలైతే ఈ సినిమా ట్రైలర్ ను నేడు జరగాల్సిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి హటాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేసుకోక తప్పలేదు. అయితే ట్రైలర్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అనుకున్న సమయానికి విడుదల చేశారు.

మంచి కిక్కిచ్చిన ట్రైలర్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ గా కనిపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య లో వచ్చే ఈగో క్లాష్ వెండితెరపై ఒక సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేయబోతున్నట్లు ట్రైలర్ తో చెప్పేశారు. ఇక ట్రైలర్ అయితే ఆడియెన్స్ కు మంచి కిక్కు ఇచ్చింది. ఇక యాక్షన్ సన్నివేశాలు హీరోయిన్స్ హీరోల సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు తమన్ బ్యాక్ మ్యూజిక్ తో మరింత బలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిమిషాల్లోనే ట్రైలర్ ట్రెండింగ్..
సినిమా ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల డోస్ ను అమాంతంగా పెంచేసింది. మొన్నటి వరకు ఫ్యాన్స్ మాత్రమే సినిమాను ఎలాగైనా చూడాలని అనుకున్నారు. కుదిరితే మొదటి రోజు మొదటి షూ టికెట్లను కూడా దగ్గించుకోవాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాలో ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని చాలామంది ఆడియోన్స్ సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ట్రైలర్ అయితే యూ ట్యూబ్ లో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే భారీ స్థాయిలో వ్యూవ్స్ లైక్స్ అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











