Pawan Kalyan: భీమ్లా నాయక్ టీజర్, ట్రైలర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రకాల సందేహాలు వస్తున్న సమయంలో ఇటీవల చిత్ర యూనిట్ ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిందది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడే అవకాశం లేదు అని, అనుకున్న సమయానికి సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
Recommended Video

సంక్రాంతి పోటీలోనే..
అంతకంటే ముందు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఆ తరువాత రెబల్ స్టార్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల మధ్య లో వస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. అసలైతే భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేయాలని చాలామంది నిర్మాతలు నుంచి ఒత్తిడి అయితే వచ్చింది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత నగవంశీ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు.

రిజల్ట్ పై క్లారిటీ వచ్చేసింది
భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలానే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటికి సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా క్లిక్కయ్యాయి. మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్స్ చూస్తేనే సినిమా రిజల్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు ట్రైలర్ కూడా విడుదల కావాల్సి ఉంది.

భీమ్లా నాయక్ టీజర్ రెడీ
భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 14న 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ టీజర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాదాపు టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది

ట్రైలర్ ఎప్పుడంటే
కరోనా ప్రభావం వలన ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దసరా సమయంలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉండడం కారణంగా మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా రాబోతున్న భీమ్లా నాయక్ ట్రైలర్ కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి మొదటి వారంలో 1వ తేదీ లేదా 5వ తేదీన భీమ్లా నాయక్ నాయక్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











