పవన్‌పై కొండంత భారం.. బండ్ల గణేష్‌తో మాట వరసకు అంటే..

ఒక స్టార్ హీరోతో కొత్త సినిమాను పట్టాలెక్కించాలి అనుకుంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్ పనులకు నెలల తరబడి సమయాన్ని తీసుకుంటున్నారు. గతంలో అయితే సిట్టింగ్ వేసిన వారం రోజులల్లో సినిమా షూటింగ్స్ మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఎంతో ఆలోచించి గాని అడుగు వేయడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం పాత కాలం పద్దతిలోనే వెళుతుండడం విశేషం. చర్చలు జరిపిన ఒక్కరోజులోనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు అదే పెద్ద భారంగా మారినట్లు తెలుస్తోంది.

 పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే..

పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే..

మొన్నటివరకు స్టార్ హీరోగా మారిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా అందరిలానే ఒక సినిమా కోసం ఏడాది సమయాన్ని తీసుకునేవారు. ఇక ఇప్పుడు మాత్రం ఒక సినిమా కోసం చాలా చిన్న టార్గెట్ పెట్టుకోవడం విశేషం. పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడం విశేషం. కానీ కరోనా వైరస్ ఆయన ప్లాన్ ని ఒక్కసారిగా మార్చేసింది.

 అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాడా

అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాడా

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి మాస్ కమర్షియల్ దర్శకులతో కూడా సినిమాలు చేయనున్న పవర్ స్టార్ ఇటీవల బండ్ల గణేష్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. నిజంగా పవన్ ఈ సినిమాలను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాడా లేదా అనేది వైరల్ గా మారింది.

గ్రౌండ్ వర్క్ చాలానే చేయాలి.

గ్రౌండ్ వర్క్ చాలానే చేయాలి.

మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్ర రాజకీయాలు కూడా ఎప్పటిలానే మరింత వేడెక్కనున్నట్లు అర్ధమవుతొంది. వచ్చే ఎన్నికల కోసం ముందుగానే సిద్ధం కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చాలానే చేయాలి. ఆ పనులే ఎక్కువగా ఉంటాయి దీంతో పవన్, హరీష్ శంకర్ సినిమాను ఎన్నికల లోపు పూర్తి చేస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. వకీల్ సాబ్ అనంతరం వెంటనే క్రిష్ సినిమాను మాత్రమే పూర్తి చేయగలడు అనే టాక్ వస్తోంది.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
 పవన్ పై కొండంత భారం

పవన్ పై కొండంత భారం

ఇక మిగతా సినిమాలు ఎలక్షన్స్ తరువాత ఉంటాయని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల బండ్ల గణేష్ తో 30వ సినిమాను ఫిక్స్ చేసుకోవడంలో అదొక తొందరపాటు నిర్ణయమే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. పవన్ ఎదో చూద్దాంలే అన్నందుకు బండ్ల ఒక్కసారిగా హడావుడి చేశాడని ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ అయితే వస్తోంది. నిజంగా పవన్ బిజీ షెడ్యూల్ ని చూస్తూంటే అతనిపై ఇప్పుడు కొండంత భారం ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ బరువు దించుకోవడానలనికి ఎలాంటి ప్రణాళికలు రావహిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X