Power Glance: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో సరికొత్త లుక్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. పవర్ గ్లాన్స్ సర్ ప్రైజ్ అయితే మామూలుగా లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మళ్ళీ మొదలు

మళ్ళీ మొదలు

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి ఒక చారిత్రాత్మక నేపథ్యమున్న కథలో కనిపించబోతున్నాడు. హరిహర వీరమల్లు సినిమాను మొదలుపెట్టి చాలా కాలమైనప్పటికీ కూడా అనుకొని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ మధ్యలో వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల చిత్ర యూనిట్ మళ్ళీ ఈ సినిమా పనుల్ని మొదలుపెట్టి మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు.

 న్యూ గ్లాన్స్

న్యూ గ్లాన్స్

దర్శకుడు క్రిష్ తప్పకుండా పవన్ కళ్యాణ్ ను చాలా పవర్ఫుల్ గా వెండితెరపై చూపిస్తాడు అని ప్రేక్షకులలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే అప్పుడెప్పుడో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయగా ఆ తర్వాత మళ్లీ పెద్దగా అప్డేట్ అయితే రాలేదు. ఇక సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరొక స్పెషల్ టీజర్ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం 5:45 పవన్ న్యూ గ్లాన్స్ టీజర్ ను విడుదల చేయనున్నారు.

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం

పవర్ గ్లాన్స్ పేరుతో విడుదల చేసిన లుక్ మామూలుగా ఉండదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడియన్స్ అయితే ఈ సినిమాపై ఒక రేంజ్ పెంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఈ పోస్టర్ ని విడుదల చేశారు. స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం.. అనే లైన్స్ కూడా వదిలారు. పవన్ యుద్ధంలో ఉన్న రథం పై సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ లుక్ చూడగానే అంచనాల స్థాయి మరింత పెరిగిపోయింది.

అలాంటి పాత్రలో

అలాంటి పాత్రలో

దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ ను గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక పవర్ఫుల్ యోధుడిగా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. రాబిన్ హుడ్ తరహాలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దనవంతుల నుంచి దోచుకొని లేని వాళ్ళకి దానం చేసే ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాలో ఎమోషనల్ డ్రామా తో పాటు మంచి హై లెవెల్ ఎలివేషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ మూమెంట్స్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయని కూడా అర్థమవుతొంది.

అప్పుడే విడుదల

అప్పుడే విడుదల

నిర్మాత AM రత్నం భారీ బడ్జెట్లో తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల కాబోతోంది. తప్పకుండా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలవుతుందని కూడా చెబుతున్నారు. అసలు అయితే 2023 జనవరి సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ ఉండడంతో ఇప్పుడు 2023 సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X