Bro: పవన్ కల్యాణ్ 'బ్రో'కి బీభత్సమైన రెస్పాన్స్.. రికార్డ్ బద్దలు కొట్టిన పవర్ స్టార్ వీడియో!
ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాపై అంచనాలు బీభత్సంగానే ఉన్నాయి. అంతకు మించి అన్నట్లుగా సినిమాల టైటిల్స్, పోస్టర్స్ విడుదల చేస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ బ్రో (BRO) టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
స్పెషల్ గ్లింప్స్: పవన్ కల్యాణ్ టాప్ డైరెక్టర్లను లైన్ లో పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒక్కో మూవీ షూటింగ్ పూర్తి చేస్తూ అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. దీన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గ్లింప్స్ ఇప్పటికే రచ్చ చేస్తోంది.

భారీ అంచనాలు: ఇక పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాకు రీసెంట్ గా బ్రో అనే టైటిల్ పెట్టినట్లుగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళంలో నటుడు దర్శకత్వం వహించి, రూపొందించిన సముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
బీభత్సమైన రెస్పాన్స్: అయితే దేవుడే దిగి వచ్చినా వంటి తదితర టైటిల్స్ ఎక్కువగా ప్రచారం జరిగినప్పటికీ చివరిగా బ్రోని ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ఇటీవల విడుదల చేసిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ కు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ దూసుకుపోతోంది. ఈ పోస్టర్ విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ వ్యూస్ అందుకుంది.
జూలై 28న రిలీజ్:యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ రెండు కలిపి మొత్తంగా 11 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటింది బ్రో టైటిల్ మోషన్ పోస్టర్. ఇదే ఆల్ టైమ్ రికార్డ్ గా మేకర్స్ తాజాగా పోస్టర్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ బ్రో టైటిల్ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో 1.2 లక్షల లైక్స్ కూడా సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాను జూలై 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

భక్తుడి కోసం దేవుడు: ఇక బ్రో టైటిల్ మోషన్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ గా దర్శనం ఇచ్చారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో కూలింగ్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని అదిరే పోజు ఇచ్చారు. అంతేకాకుండా బ్రో అనే టైటిల్ ఇంగ్లీష్ లెటర్స్ లో కాల గమనాన్ని సూచిస్తూ గడియారం తిరుగుతూ ఆసక్తిని పెంచింది. హిందూ మతం కీర్తనలు, పురాణాల ఆధారంగా రూపొందిన భక్తి గేయాన్ని జోడించి హైప్ పెంచారు. తన భక్తుడి కోసం పైనుంచి కిందకు దేవుడు దిగివచ్చినట్లుగా పోస్టర్ ద్వారా ఇండికేట్ చేశారు.


Click it and Unblock the Notifications











