Bro: అన్ని చోట్ల బ్రో సినిమా నిలిపివేత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఎక్కడంటే?

హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరోవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పొలిటిషియన్స్, పవన్ కల్యాణ్ మధ్య జరిగే మాటల యుద్ధం తెలిసిందే. ఒకరిపైమరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. ఇక పవన్ కల్యాణ్ ప్రత్యర్థులపై అదిరిపోయే పంచ్ లతో స్పీచ్ లు ఇస్తుంటారు. ఇదిలా ఉంటే పవన్ భక్తులు ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నేడు (జూలై 28న) థియేటర్లలో ఆయన నటించిన బ్రో సినిమా విడుదలైంది. అయితే పండుగలా ఫీల్ అవుతున్న పవన్ అభిమానులకు రెండు చోట్ల మాత్రం నిరాశ ఎదురైంది.

బీజీఎంలతో:పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. తమిళ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు. బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు.

Pawan Kalyan Bro Movie Shows Stopped In Kavali And Amadalavalasa

బ్రో టైటిల్ స్టోరీ:వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ అనుకున్న సముద్ర ఖని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కథ చెప్పగా.. ఆయన పూర్తిగా స్క్రిప్ట్ మార్చేశారు. దాన్ని బ్రో సినిమాగా తెరకెక్కించారు. అందుకు సంభాషణలు, స్క్రీన్ ప్లేతో సహకారం అందించారు త్రివిక్రమ్. మొదటగా చిరంజీవి, కాలపురుషుడు అని టైటిల్ అనుకున్న ఫైనల్ గా మాత్రం బ్రోగా పేరు పెట్టారు.

లతా థియేటర్:ముద్దుగుమ్మలు కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌటెలా గ్లామర్ తో ఆకట్టుకున్న బ్రో సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న బ్రో సినిమాను రెండో చోట్ల నిలిపివేశారు. బ్రో ప్రదర్శితమవుతున్న కావలిలోని లతా థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Pawan Kalyan Bro Movie Shows Stopped In Kavali And Amadalavalasa

పరిస్థితి అదుపులో:ఏపీలోని కావలిలో లతా థియేటర్ లో సౌండ్ సిస్టమ్ ఐసీలు ఫెయిల్ కావడంతో యాజమాన్యం పవన్ కల్యాణ్ బ్రో సినిమాను నిలిపివేసింది. దీంతో పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్ యాజామాన్యం పవన్ భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో థియేటర్ వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేసినట్లు సమాచారం.

Pawan Kalyan Bro Movie Shows Stopped In Kavali And Amadalavalasa

శ్రీదేవి థియేటర్:కావలిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని శ్రీదేవి థియేటర్ లో కూడా బ్రో బెనిఫిట్ షో నిలిపివేశారు. పలు సాంకేతిక కారణాలతో షో ఆగిపోగా.. ఉదయం నుంచి షో వేయకపోడవంతో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థియేటర్ యాజామాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pawan Kalyan Bro Movie Shows Stopped In Kavali And Amadalavalasa

రెండు వర్గాల్లో:కావలి, ఆముదాలవలస ఇలా రెండు చోట్ల బ్రో షో నిలిపివేయగా.. మరోవైపు గూడురు పట్టణం సంగం థియేటర్ లో మూవీ ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించివేసింది. దీంతో ఏకమైన పవన్ ఫ్యాన్స్ రెండు వర్గాలు మూకుమ్మడిగా ఆందోళన చేశాయి. అప్పుడు చేసేదిలేక మళ్లీ థియేటర్ మేనేజ్ మెంట్ తిరిగి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X