twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa Elections: ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి.. అయ్యప్ప మాలలో వచ్చిన రామ్ చరణ్

    |

    గత నెల రోజులులుగా మా ఎన్నికలు ప్రెస్ మీట్స్ తో హాట్ టాపిక్ గా నిలిచిన సెలబ్రేటీలు ఈ రోజు చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆదివారం 'మా' ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ప్రముఖ సీనియర్ నటీనటులు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక ఉదయం 8గంటలకు మొదలైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత 'మా' కౌంటింగ్‌ మొదలు కానుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం అయితే నార్మల్ గానే ఉంది.

    900ల ఓట్లకు పైగా

    900ల ఓట్లకు పైగా

    జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన మా పోలింగ్ సెంటర్ వద్ద టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా దర్శనమిస్తున్నారు. వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ మీడియా ముందు కూడా పాజిటివ్ గా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం తొందరగానే ఓటు వేసి వెళ్లిపోతున్నారు. 900కు పైగా నమోదు కావాల్సిన ఈ ఓట్లల్లో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.

    స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    ఇక ఉదయమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన పార్టీ అధినేతగా కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ గా క్యాజువల్ గా జీన్స్ టీ షర్ట్ తో వచ్చాడు. ఇక ఓటు వేసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే అని తెలిపిన పవన్ మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా ? అని ప్రశ్నించారు. అంతే కాకుండా సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి అంటూ సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదు అని తెలియజేశారు.

    ఓటు వేసిన బాలకృష్ణ

    ఓటు వేసిన బాలకృష్ణ

    ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఉదయనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తరువాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇండస్ట్రీలో అందరికి సమన్యాయం చేసేవారికి ఓటు వేయడం జరిగింది అంటూ ఇద్దరు కూడా మంచి వారే అయితే ఎవరెవరు అందులో బెస్ట్ అనేది ఆలోచించి ఓటు వేయడం జరిగిందని అన్నారు.

    అయ్యప్ప మాలలో వచ్చిన రామ్ చరణ్

    అయ్యప్ప మాలలో వచ్చిన రామ్ చరణ్

    ఇక పవన్ కళ్యాణ్ ఓటు వేసిన అనంతరం రామ్ చరణ్ కూడా పోలింగ్ సెంటర్ కు వచ్చారు. రామ్ చరణ్ ప్రతి ఏడాది కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు కూడా అయ్యప్ప మాలలో కనిపించారు. దీక్షలో ఉన్న మెగా పవర్ స్టార్ కూల్ గా తన ఓటు హక్కును వినియోగించుకొని సైలెంట్ గా వెళ్లిపోయారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    మెగాస్టార్ చిరంజీవి కూడా..

    మెగాస్టార్ చిరంజీవి కూడా..

    ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. కానీ మీడియాతో మాట్లాడేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపలేదు. మెగాస్టార్ తో పాటు మరికొందరు సీనియర్ నటులు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. మెగాస్టార్ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాగబాబు కూడా ప్రత్యక్షంగానే కామెంట్స్ చేస్తూ మద్దతు పలికారు.

    English summary
    Pawan kalyan chiranjeevi ram charan balakrishna casted their votes in maa elections 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X