Pawan Kalyan: ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్.. OG 2 పై పవన్ కళ్యాణ్ క్లారిటీ..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీతో మరోసారి తన మాస్ ఇమేజ్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
గత కొద్ది రోజులుగా పలువురు దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నారని, త్వరలో కొత్త సినిమాలు ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ 33వ సినిమా పట్టాలెక్కబోతుందనే ప్రచారం జరుగుతుండటంతో ఈ టాపిక్ మరింత హాట్‌గా మారింది.ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత బృందం స్పందించింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్‌ను ఎదుర్కొంటోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 80.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 71.15 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ. 60.30 కోట్లకు చేరింది.
ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 9.60 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో మొదటి రోజు రూ. 34.75 కోట్లతో భారీ ఓపెనింగ్ అందుకున్న ఈ సినిమా, రెండో రోజు రూ. 9 కోట్లు, మూడో రోజు రూ. 9.05 కోట్లు, నాలుగో రోజు రూ. 7.5 కోట్లు రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇంకా పెద్ద రన్ అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే, మరోవైపు సినిమాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రీఎంట్రీ తర్వాత ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తూ వస్తున్నారు. వీలున్నప్పుడల్లా షూటింగ్స్‌లో పాల్గొంటూ, తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంతో ముఖ్యంగా మోహన్ రాజా, దేవా కట్టా వంటి దర్శకులతో ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యాయని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలన్నింటికీ ఆయన వ్యక్తిగత బృందం ఫుల్ స్టాప్ పెట్టింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమా కమిట్‌మెంట్స్ తీసుకోలేదని పవర్ స్టార్ టీమ్ స్పష్టం చేసింది. 'ప్రస్తుతం కొత్త సినిమాలు ప్రారంభించే ప్రణాళికలు లేవు. జరుగుతున్నాయని చెప్పబడుతున్న ప్రాజెక్టులపై వార్తలు ఖచ్చితమైనవి కావు. ఏదైనా అధికారిక అప్డేట్ ఉంటే సరైన సమయంలో ప్రకటిస్తాం' అని వెల్లడించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న గందరగోళానికి క్లారిటీ వచ్చినట్లైంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న OG 2 ప్రాజెక్ట్‌పై కూడా కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా, స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని చెప్పారు. అప్పటి వరకు వస్తున్న రూమర్స్‌ను నమ్మవద్దని సూచించారు. దీంతో OG సీక్వెల్‌పై ఉన్న ఆసక్తి ఇంకా పెరిగింది.
ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న టాక్ ఉన్నప్పటికీ, అధికారిక అనౌన్స్‌మెంట్ మాత్రం రావాల్సి ఉంది.
మొత్తం మీద పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై వస్తున్న వార్తలు ప్రస్తుతం ఊహాగానాలే అని స్పష్టమైంది. ఆయన దృష్టి ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులపైనే ఉంది. కొత్త సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడంతో అభిమానులు ఇప్పుడు ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. OG 2 ఎప్పుడు? కొత్త సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications





















