Vinodhaya Sitham: రాకెట్‌లా దూసుకెళ్తోన్న పవన్.. ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి!
రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే మూడు నాలుగు ప్రాజెక్టులను ప్రకటించాడు. అంతేకాదు, వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే 'వినోదయ సీతమ్' రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
తమిళంలో రూపొంది ZEE5 ఓటీటీలో డైరెక్టుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసి 'వినోదయ సీతమ్' సినిమాకు సముద్రఖని డైరెక్టర్‌గా చేయడంతో పాటు అందులో ముఖ్యమైన పాత్రను కూడా చేశారు. ఇప్పుడిదే సినిమాను పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అభిమానులను ఖుషీ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న 'వినోదయ సీతమ్' రీమేక్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఇందుకోసం పవర్ స్టార్ కేవలం 30 రోజులు డేట్స్ మాత్రమే కేటాయించినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రాన్ని ఎంతో వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు 30 శాతం వరకూ పూర్తైనట్లు తెలిసింది. అతి తక్కువ రోజుల్లోనే ఇంత షూటింగ్ జరగడంతో.. ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికే విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇది మెగా ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునే న్యూసే అని చెప్పొచ్చు.

మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రను పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











