PKSDT: పవన్ ఫ్యాన్స్‌కు ‘స్పీడ్’ సర్‌ప్రైజ్.. అతడి కెరీర్‌లోనే తొలి మూవీగా రికార్డు
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా చేయడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటున్నాడు. కానీ, ఒకే ఒక్క తెలుగు హీరో మాత్రం ఏకకాలంలోనే నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నాడు. అతడే.. మెగా కాంపౌండ్‌కు చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనలోని కొత్త కొత్త యాంగిల్స్ చూపిస్తోన్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు చాలా చిత్రాలను చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'వినోదయ సీతమ్' అనే మూవీ రీమేక్‌లో నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొంది నేరుగా ZEE5 ఓటీటీలో అయిన చిత్రమే 'వినోదయ సీతమ్'. దీన్ని ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే డైరెక్టర్‌తో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా, ఎంతో వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి పవర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చేసింది.
పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న 'వినోదయ సీతమ్' రీమేక్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా కేవలం 30 రోజుల్లోనే పవన్ పార్టును ముగించాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ చిత్రంలో ఆయన భాగాన్ని కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు పవన్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేసి 'థ్యాంక్యూ గాడ్.. కల్యాణ్ సార్ పాత్రకు సంబంధించిన భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. జూలై 28న మీ అందరినీ థియేటర్లలో కలుస్తాం. గెలుద్దాం' అని చెప్పుకొచ్చారు.
మెగా హీరోల కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











