కౌబోయ్, జేమ్స్‌బాండ్ పాత్రలో కొత్త అనుభూతి.. ఎంపీగా తనదైన ముద్ర.. పవన్ కల్యాణ్ సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది. కృష్ణ ఇక లేరనే వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. కృష్ణ మరణవార్తతో తీవ్రంగా చలించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శ్రద్దాంజలి ఘటించారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ శ్రద్దాంజలి ఘటించారు. ప్రత్యేకంగా సంతాప ప్రకటనను పవన్ కల్యాణ్ విడుదల చేస్తూ..

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసిన తర్వాత కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 Pawan Kalyan condolences on Super Star Krishna Death

సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X