అన్నయ్య చిరంజీవి సినిమాలకు అలాంటి బాధ్యతలు.. బీఏ రాజు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం

టాలీవుడ్‌లో సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. బీఏ రాజు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణంతో షాక్ గురైన ప్రతీ ఒక్కరు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ విషాదం నుంచి తేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీఏ రాజు మరణంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనను విడుదల చేశారు.

బీఏ రాజుకు పవన్ కల్యాణ్ శ్రద్దాంజలి ఘటిస్తూ.. జర్నలిస్టుగా, పీఆర్వోగా తెలుగు సినీ రంగంలో సుపరిచితులైన బీఏ రాజు మరణం దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీఏ రాజుతో అనుబంధం, పరిచయం చెన్నై నుంచి ఉంది. సినిమా అంటే తపన కలిగిన జర్నలిస్ట్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు చిత్రాలకు పీఆర్వోగా బాధ్యతలు చూశారు అని పవన్ కల్యాణ్ పలు విషయాలను గుర్తు చేశారు.

 Pawan Kalyan Condolences to BA Raju death

జర్నలిస్టుగా, పీఆర్వోగా తనదైన శైలిలో రాణించిన బీఏ రాజు సూపర్ హిట్ అనే సినిమా పత్రికను ప్రారంభించి సక్సెస్ అయ్యారు. కేవలం సంపాదకులుగానే కాకుండా నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో స్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతమైన జీవితాన్ని సాగిస్తున్న బీఏ రాజు మరణం విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X