పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం.. పవన్ కల్యాణ్ పరామర్శ

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి కన్నుమూయడంతో సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా స్వయంగా ఓదార్చలేకపోయిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా, ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మరణవార్తను తెలియగానే మెగా ఫ్యామిలీ తమ సంతాపం ప్రకటించి ఫోన్‌లో ఓదార్చారు. తాజాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాప ప్రకటనను విడుదల చేశారు.

తన సంతాప ప్రకటనలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి విజయలక్ష్మి గారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పరుచూరి సోదరుల కుటుంబాలతో మా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఈ కష్ట సమయంలో శ్రీ వెంకటేశ్వర రావు గారికి, వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

Pawan Kalyan condolences to Paruchuri Venkateswara Rao

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పలువురు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు భగవతుండిని ప్రార్థిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X