బాహుబలి-2 ఇంటర్వెల్ సీన్ రిపీట్.. పవన్ క్రేజ్ చూసి సెంట్రల్ మినిస్టర్ షాక్!
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయనకు ఎనలేని ప్రజాదరణ ఉంది. పవన్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయన పేరుతో నినాదాలు చేయడం తరచూ కనిపించే దృశ్యమే. తాజాగా తిరుపతి జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. సభలో పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోవడంతో అక్కడ ఉన్న కేంద్రమంత్రి కూడా ఆశ్చర్యపోయారు.
గురువారం తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీ రామ్-జీ (VB G RAM-G) పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రోహిత్ కన్సల్ ప్రసంగించేందుకు మైక్ దగ్గరకు వెళ్లగానే.. సభలో ఉన్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఒక్కసారిగా "పవన్ కళ్యాణ్... పవన్ కళ్యాణ్... ఓజీ.. ఓజీ " అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రారంభించారు. కొద్ది సేపు సభ మొత్తం ఆ నినాదాలతో మార్మోగిపోయింది.

అభిమానుల నినాదాలు ఆగకపోవడంతో కేంద్ర కార్యదర్శి కాసేపు ప్రసంగాన్ని ఆపి, వేచి చూశారు. అనంతరం ఆయన పవన్ వైపు చూసి నవ్వుతూ స్పందించడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు దీనిని 'బాహుబలి-2' ఇంటర్వెల్ సీన్‌తో పోలుస్తున్నారు. 'బాహుబలి-2' ఇంటర్వెల్ సీన్ మళ్లీ రిపీట్ అయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
బాహుబలి 2 సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కీలక సన్నివేశంలో అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేకం జరుగుతుందని ప్రజలు ఎదురుచూస్తారు. కానీ చివరకు భల్లాలదేవుడు రాజుగా ప్రకటించబడతాడు. అయినప్పటికీ సభలో ఉన్న ప్రజలంతా "బాహుబలి... బాహుబలి..." అంటూ అమరేంద్ర బాహుబలి పేరునే నినదిస్తారు. ఆ సన్నివేశం సినిమాలో అత్యంత భావోద్వేగపూరితంగా ఉంటుంది. థియేటర్లలో ఆ సీన్ చూస్తే మాత్రం గుస్ బంప్స్ వస్తాయి. అలాంటి మూమెంట్ రిపీట్ అయ్యిందని, ఇదే పవన్ కళ్యాణ్ క్రేజ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అభిమానుల్లో ఏమాత్రం తగ్గని ఆదరణ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ ఇంటర్వెల్ సీన్‌కు ప్రేరణ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే.. ఈ విషయాన్ని గతంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించారు. పబ్లిక్ ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు వేదికపై ఎవరు మాట్లాడుతున్నా అభిమానులు నిరంతరం "పవన్... పవన్..." అంటూ నినాదాలు చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని, అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని 'బాహుబలి-2'లో ఆ ఇంటర్వెల్ సీన్‌ను రూపొందించామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ - యంగ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ' ఓజీ 2 ' (OG 2) రాబోతుంది. ఈ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications



