పవన్ కళ్యాణ్ డాటర్ డ్యూయల్ రోల్ సక్సెస్.. అకిరా కంటే ముందే ఎంట్రీ ఇచ్చేలా ఉంది!
పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనంతరం ఆయన అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది. నిజానికి పవర్ స్టార్ ని ఇన్నాళ్లు వెండితెరపై చూసి చొక్కాలు చిచ్చుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఆ గ్యాప్ చాలా ఇబ్బంది పెట్టింది. అయితే మొత్తానికి రీ ఎంట్రీకి సిద్ధమైన పవన్ అభిమానుల్లో మళ్ళీ అంచనాల స్థాయిని పెంచుకుంటున్నారు.
Recommended Video

వారసుడి కోసం వెయిటింగ్..
సెకండ్ జనరేషన్స్ లో మెగా బ్రదర్స్ తనయులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇప్పటికే టాలీవుడ్ లో వారికంటూ ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ మెగా అభిమానులంతా జూనియర్ పవర్ స్టార్ తనయుడి కోసమే ఎదురుచూస్తున్నారు. అకిరా నందన్ టీనేజ్ దాటేసి ఇప్పటికే అందరికంటే ఎక్కువ హైట్ పెరిగాడు. దీంతో బిగ్ స్క్రీన్ పైకి అకిరా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ఆద్య ముందుగానే..
చూస్తుంటే పవన్ పెద్ద కుమార్తె ఆద్య అకిరా కంటే ముందే ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని మెగా అభిమానులు సరదాగా కామెంట్ చూస్తున్నారుమ్ ఎందుకంటే ఇటీవల ఆద్య తన టాలెంట్ స్కిల్స్ ని బయటపెట్టింది. డ్యూయల్ రోల్స్ చేయడమే కాకుండా సొంతంగా కాన్సెప్ట్ ఎంచుకొని డైరెక్షన్, ఎడిటింగ్ కూడా సొంతంగానే చేసిందట. అందుకు సంబంధించిన వీడియోను తల్లి రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

డ్యూయల్ రోల్ సక్సెస్..
మెగా డాటర్ ఆద్య తన స్కిల్స్ ఉపయోగింది ఒక జోక్ వీడియో చేసింది. డాక్టర్, పేషేంట్స్ లా కనిపించి ఆకట్టుకుంది. పేషేంట్ కి చనిపోయే బ్యాడ్ న్యూస్ ని ఆలస్యంగా చెబుతున్నట్లు సరదాగా ఆద్య చేసిన కామెడీ స్కిట్ వర్కౌట్ అయ్యింది. పవన్ అభిమానులు ఆద్య వీడియోను చాలా లైక్ చేస్తూ.. అకిరా కంటే స్పీడ్ గా ఉందని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

రేణూ దేశాయ్ రీ ఎంట్రీ..
ఇక రేణూ దేశాయ్ మరోసారి వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా కనిపించడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక గతంలో పలు అవకాశాలు వచ్చినప్పటికీ రేణూ పలు కారణాల వల్ల చేయలేకపోయిందట. ఇక ఇప్పుడు రెడీగా ఉన్నట్లు చెప్పడంతో ఓ వర్గం ఆడియెన్స్ ఆమె రీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











