For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నప్పటి నుంచీ పరిచయం.. పసుపులేటి రామారావు మృతిపై పవన్ కళ్యాణ్

    |

    తెలుగు సినీ ప్రపంచంలో సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు అంటే తెలియని వారుండరు. నాటి హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు ఆయన్ను గౌరవిస్తుంటారు. ఆయన చేసే విమర్శలను సైతం స్వీకరిస్తూ ఉంటారు. అంతటి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నేడు (ఫిబ్రవరి 11) మ‌ృతి చెందారు. ఈయన మ‌ృతిపై చిరంజీవి మొదలు యంగ్ హీరోల వరకు అందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొరటాల శివ, పవన్ కళ్యాణ్ స్పందించారు.

    పసుపులేటి మృతిపై కొరటాల శివ స్పందిస్తూ.. 'సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు గారి అకాల మరణం చాలా బాధాకరం. వారి నిరాడంబరత,వారు పాటించిన విలువలు, భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం. పలు సందర్భాల్లో వారితో జరిపిన సంభాషణలు నాకు మిగిలిన మంచి స్మృతులు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా'ని పోస్ట్ చేశాడు.

    Pawan Kalyan Deepest Condolence To Pasupuleti RamaRao

    పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 'సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసిన సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'నంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశాడు.

    English summary
    Cine Pro, senior journalist Pasupuleti RamaRao paased away On 11th February. Cine celebrities Pays Deepest condolences to his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X