BRO: పవన్ కల్యాణ్ నుంచి సర్‌ప్రైజ్.. బ్రో మూవీలో హైలైట్ అవే
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత నుంచి జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అందులో 'బ్రో (BRO)' ఒకటి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తోన్న ఈ మూవీని సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో సక్సెస్ అయిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా రాబోతుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీని జూలై 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్లను వరుసగా ఇస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. దీనికి క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న 'బ్రో (BRO)' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో దీని నుంచి ఎన్నో రకాల వార్తలు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలోని హైలైట్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చే డైలాగులు అదిరిపోయేలా ఉంటాయట. ముఖ్యంగా సమయం, జీవితం, నైతిక విలువల గురించి చెప్పే మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయని తెలిసింది. ఇవి చాలా కాలం ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. దీంతో హైప్ మరింత పెరుగుతోంది.
మెగా హీరోల కాంబోలో వస్తున్న 'బ్రో (BRO)' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











