Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేంద్రీయ సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ విరాళం.. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో గౌరవించిన అధికారులు
భారతదేశ రక్షణ కొరకు విధి నిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలను కేంద్రీయ సైనిక్ బోర్డు ఆదుకుంటుందన్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలలో పనిచేసే ప్రతి ఒక్క సైనికుడి కుటుంబానికి కేంద్రీయ సైనికి బోర్డు అండగా నిలబడుతుంది. ఇందుకొరకు కావాల్సిన నిధులను ప్రజల వద్ద నుండి విరాళాల రూపంలో సేకరిస్తుంది. అలాంటి సైనిక్ బోర్డ్‌కు పవన్ కళ్యాణ్ భారీ మొత్తం విరాళాన్ని అందజేశాడు.

సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా..
ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటాము. మన దేశం కోసం సాయుధ దళాల సైనికులు చేస్తున్న కృషిని ఆరోజున మనం మరొకసారి గుర్తుచేసుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి దేశభక్తిని చాటుకున్నాడు.
చెక్కును అందజేసిన పవన్..
డిసెంబర్ 7న చెప్పినట్లుగానే ఈరోజు (ఫిబ్రవరి 20) సైనిక్ బోర్డును సందర్శించి నిర్వాహుకులకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును అందజేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.

ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో..
దేశంపై ఉన్న ప్రేమను, దేశాన్ని కాపాడే సైనికుల పట్ల ఉన్న ప్రేమను వారిని ఆదుకోవడానికి చేతనైన సహాయాన్ని చేసిన పవన్ కళ్యాణ్‌ను సైనిక అధికారులు గౌరవించారు. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో అక్కడి అధికారులు పవన్‌ను గౌరవించారు.


వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మాణంలోని పింక్ రీమేక్, ఏఎమ్ రత్నం బ్యానర్‌పై క్రిష్‌తో ఓ సినిమాను, మైత్రీ సంస్థతో హరీష్ శంకర్ చేసే ప్రాజెక్ట్‌తో పవన్ కళ్యాణ్ బిజిబిజీగా ఉన్నాడు. వీటిలో పింక్ రీమేక్ శర వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది.