twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్రీయ సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ విరాళం.. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో గౌరవించిన అధికారులు

    |

    భారతదేశ రక్షణ కొరకు విధి నిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలను కేంద్రీయ సైనిక్ బోర్డు ఆదుకుంటుందన్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలలో పనిచేసే ప్రతి ఒక్క సైనికుడి కుటుంబానికి కేంద్రీయ సైనికి బోర్డు అండగా నిలబడుతుంది. ఇందుకొరకు కావాల్సిన నిధులను ప్రజల వద్ద నుండి విరాళాల రూపంలో సేకరిస్తుంది. అలాంటి సైనిక్ బోర్డ్‌కు పవన్ కళ్యాణ్ భారీ మొత్తం విరాళాన్ని అందజేశాడు.

    సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా..

    సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా..

    ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటాము. మన దేశం కోసం సాయుధ దళాల సైనికులు చేస్తున్న కృషిని ఆరోజున మనం మరొకసారి గుర్తుచేసుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి దేశభక్తిని చాటుకున్నాడు.

    చెక్కును అందజేసిన పవన్..

    డిసెంబర్ 7న చెప్పినట్లుగానే ఈరోజు (ఫిబ్రవరి 20) సైనిక్ బోర్డును సందర్శించి నిర్వాహుకులకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును అందజేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.

    ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో..

    ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో..

    దేశంపై ఉన్న ప్రేమను, దేశాన్ని కాపాడే సైనికుల పట్ల ఉన్న ప్రేమను వారిని ఆదుకోవడానికి చేతనైన సహాయాన్ని చేసిన పవన్ కళ్యాణ్‌ను సైనిక అధికారులు గౌరవించారు. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో అక్కడి అధికారులు పవన్‌ను గౌరవించారు.

    Recommended Video

    Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu
    వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

    వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

    పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మాణంలోని పింక్ రీమేక్, ఏఎమ్ రత్నం బ్యానర్‌పై క్రిష్‌తో ఓ సినిమాను, మైత్రీ సంస్థతో హరీష్ శంకర్ చేసే ప్రాజెక్ట్‌తో పవన్ కళ్యాణ్ బిజిబిజీగా ఉన్నాడు. వీటిలో పింక్ రీమేక్ శర వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది.

    English summary
    The actor turned politician Pawan Kalyan donated Rs 1 Crore to Kendriya Sainik Board for the welfare of our soldiers families. has urged his followers and fellow Indians to support the families of armed forces.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X