twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోటి రూపాయల విరాళం.. అది నాకు గర్వకారణం.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు

    |

    పవన్ కళ్యాణ్‌కు దేశ భక్తి ఉందన్న సంగతి ఎన్నోసార్లు నిరూపితమవుతూనే ఉంటుంది. ఆయన చేతల్లో, మాటల్లో అది నిత్యం ప్రస్ఫుటమవుతుంది. ప్రసంగం చివర్లో జై హింద్ అనడం, అతని సినిమాల్లో దేశ భక్తి, సమాజానికి సంబంధించిన పాటలను పెట్టి కొందర్నీ అయినా చైతన్య పరచాలని చూస్తుంటారు. తాజాగా మరోసారి ఆయనకు దేశం మీదున్న ప్రేమను చాటి చెప్పాడు.

     సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా

    సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా

    డిసెంబరు 7న సాయుధ దళాల పతాకదినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ సైనికుల పట్ల తన ప్రేమను మరోసారి ఘనంగా చాటుకున్నారు. అమరులైన సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్రీయ సైనిక్ బోర్డుకు తనవంతు ఉడతా భక్తిగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

    గతంలో కూడా..

    గతంలో కూడా..

    సైనికుల పట్ల శ్రీ పవన్‌ కల్యాణ్ గారికి ఈ గౌరవాభిమానాలు తొలి నుంచి ఉన్నవే. గతంలో తమ్ముడు చిత్రం చేస్తున్నప్పుడు కూడా కార్గిల్ లో పోరాడుతున్న వీరుల కోసం లక్ష రూపాయల విరాళం అందించాడు. అప్పట్లో తమ్ముడు ఆడియో ఫంక్షన్ సందర్భంగా.. తన తండ్రి కె.వెంకటరావు చేతుల మీదుగా.. అప్పటి వైమానికదళ మాజీ ప్రధానాధికారి శ్రీ ఐహెచ్ లతీఫ్‌కు అందజేశాడు.

     తాజాగా మరోసారి..

    తాజాగా మరోసారి..

    తాజాగా మరోమారు కోటి రూపాయల విరాళాన్ని అందించి ప్రేమను చాటుకున్నాడు. డిసెంబరు 7న సైనిక పతాక దినోత్సవం సందర్భంగా.. సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేంద్రకుమార్ పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ రాస్తూ పతాకదినోత్సవం గురించి ఓ వీడియో సందేశం పంపాల్సిందిగా కోరారు. సైనికులు మన కోసం, మన దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారని, పతాక దినోత్సవం సందర్భంగా మన వంతుగా మనం కూడా వారి కోసం కొంత చేయాలని ఆ వీడియో సందేశంలో పవన్ కల్యాణ్ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చాడు. వీడియో సందేశంతో పాటు కోటిరూపాయల విరాళం కూడా ప్రకటించాడు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    అమరవీరులైన సైనిక కుటుంబాలకు..

    అమరవీరులైన సైనిక కుటుంబాలకు..

    మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు పిలుపు ఇచ్చినట్లుగా మనమందరం కూడా అమరవీరులైన సైనిక కుటుంబాలకు సంఘీభావంగా.. ఉదారంగా స్పందించి కేంద్రీయ సైనిక్ బోర్డుకు విరాళాలు ఇచ్చి, అండగా నిలవాలంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చెప్పాడు. తమ కుటుంబంలో అమ్మ తరఫు తాతయ్య, తన పెదనాన్న ఇద్దరూ కూడా సైన్యంలో సేవలందించిన వారే కావడం తనకు గర్వకారణమని కూడా తెలిపాడు. సైనిక పతాక దినోత్సవం సందర్భంగా కోటి రూపాయల విరాళం ప్రకటించి పవన్ కల్యాణ్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

    English summary
    The actor turned politician Pawan Kalyan said he will be donating Rs 1 Crore to Kendriya Sainik Board for the welfare of our soldiers families. has urged his followers and fellow Indians to support the families of armed forces through KSB (Kendriya Sainik Board) through a short video byte.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X