2019 ఓడిపోతే ఎలాంటి బాధో.. ఇప్పుడు కూడా అదే మానసిక పరిస్థితి.. పవన్ కల్యాణ్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత తన కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే సమయం. విభజన జరిగినప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాం. ఆ చీకటి రోజులు పోయాయి అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈ తీర్పు. ఇది అందరం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది వేసే సమయం. రైతన్నకు అన్నం పెట్టే సమయం. రక్షణలేని ఆడపిల్లలకు రక్షణ కల్పించే సమయం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేస్తానని హామీ ఇచ్చాను. నాకు గుర్తు ఉంది. సంవత్సరంలోపు సీపీఎస్ అమలు చేస్తానని మాటిచ్చాను. అప్పటిలోగా అమలు చేస్తాను. నిరుద్యోగంతో అలమటిస్తున్న యువతకు మెగా డీఎస్సీ వేస్తాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చు. 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేశాం. వందకు వందశాతం గెలిచాం. 175 మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో..అంత బాధ్యతగా పనిచేస్తాం. యువత నలిగిపోయిన విషయాన్ని, ఆడబిడ్డలు అన్యాయాన్నికి గురయ్యారు. ఉద్యోగులు వేధింపులకు గురయ్యారు. రోడ్డు అధ్వాన్నంగా మార్చారు. అవన్నీ నెరవేర్చే బాధ్యతను తీసుకొంటాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం లేకుండా, అధికారులను పనిచేసుకొనేలా చర్యలు తీసుకొంటాం. డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి కష్టాలను చూసిన వాడిని. ఆ మనిషి కష్టాన్ని పంచుకొంటాను.
2019 ఓడిపోతే ఎలాంటి మానసిక స్థితి ఉందో.. ఈ రోజు గెలిచినా గానీ అలాంటి మానసిక స్థితి ఉంది. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. భయం వేస్తున్నది. ఇల్లు అలకగానే.. పండగ కాదు. చాలా బాధ్యతతో కూడుకొన్నది. భీమవరం, గాజవాక ఓడిపోయినప్పుడు ఆ రోజున నా పక్కన కొద్ది మంది తప్ప ఎవరూ లేరు.


Click it and Unblock the Notifications









