For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan Kalyan: నా అన్నయినా తండ్రిలానే.. తల ఎగరేసే మనిషి కాదు.. అదే అసలు అదృష్టం!

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగుకే పరిమితం కాకుండా ఆయన భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు లిఖిన్చుకున్నారు ఆయన. తనకు మాత్రమే సాధ్యమయ్యే నటన, డాన్స్, స్టైల్ తో నాలుగు దశాబ్దాలుగా అభిమానులని ఉర్రూతలూగిస్తున్న చిరంజీవి నేడు 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నకు చాలా ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే

  అదృష్టం

  అదృష్టం

  చిరు జన్మదినం సందర్భంగా పవన్ సుదీర్ఘ లేఖ రాశారు. ''అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు, చిరంజీవి. నాకే కాదు ఎందరికో మార్గదర్శి, చిరంజీవి... నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత, చిరంజీవి. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు'' అని పవన్ పేర్కొన్నారు. ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయన్న ఆయన ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం అని అన్నారు.

  తల ఎగరేయలేదు

  తల ఎగరేయలేదు

  అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాది మందిలో నేను తొలి అభిమానిని అని పేర్కొన్న పవన్ ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలు వీక్షిస్తూ... ఆయన ఉన్నతిని కనులార చూశానని, ఒక ఆసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా... తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా నందులు తరలి వచ్చినా... పద్మభూషణ్ గా కీర్తి గడించినా.. చట్టసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పదవులు అలంకరించినా ఆయన తల ఎగరేయలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

  ఆదుకోవడంలో ముందుంటారు

  ఆదుకోవడంలో ముందుంటారు

  విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయం, అదే వినమ్రత శ్రీ చిరంజీవి గారి సొంతం, అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భాషలు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న శ్రీ చిరంజీవి నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి... కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువు నిస్తూ తనలోని సేవా గుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు... చేస్తూనే ఉన్నారని పవన్ పేర్కొన్నారు.

  తండ్రి స్థానంలో నిలిచారు

  తండ్రి స్థానంలో నిలిచారు

  కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపన పడ్డారు. అందువల్ల సినీ కార్మికులు అందరూ శ్రీ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారని అలాగే తండ్రి స్థానంలో నిలిచారని అన్నారు.

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
  చిరాయువుతో చిరంజీవిగా

  చిరాయువుతో చిరంజీవిగా

  అలాగే ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. చిరంజీవి గారికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని పవన్ పేర్కోన్నారు. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం బిజీ బిజీగా గడుపుతున్నారు.

  English summary
  Pawan Kalyan penned some emotional Words as wishes For Chiranjeevi Birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X