Renu Desai : వాడొక ఇడియట్ .. రణ్‌వీర్‌పై రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ , షాక్‌లో బాలీవుడ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌... సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం తన వంతు సాయంగా పాటు పడుతుంటారు. ఈ విషయంలో పవన్ - రేణూ దేశాయ్‌ల ఆలోచనలు, అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయి. మూగజీవాల కోసం ఏకంగా ఓ ఎన్జీవో సంస్థనే స్థాపించి వాటి సంక్షేమం కోసం పాటు పడుతున్నారు రేణూ దేశాయ్.

పవన్‌తో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి వారిని పెంచి పెద్ద చేసిన ఆమె .. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తూ తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలు కూడా మారేలా అవగాహన కల్పిస్తుంటారు రేణూ దేశాయ్. ఇక భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఇష్టపడే ఆమె ప్రతి మాసంలోనూ వచ్చే పండుగలు, విశిష్ట దినాలను ఘనంగా జరుపుకుంటారు.

Pawan kalyan ex wife renu desai fires on ranveer allahbadia over his comments at india s got latent

పెద్దలు అనుసరించిన విధానాలను పిల్లకు నేర్పించాలని ఆమె కోరారు. అలాగే వారికి మన సాంప్రదాయ వస్త్రధారణను అలవాటు చేయాలని.. మగపిల్లలు ధోతీ కట్టుకుంటూ ఉండాలని సూచించారు. ప్యాంట్స్ మన కల్చర్ కాదని మన సంస్కృతిని ఓన్ చేసుకోవాలని.. ధోతి, లుంగీలు వేసుకోవడానికి సిగ్గుపడొద్దని ఆమె యువతరానికి పిలుపునిచ్చారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం దేశంలో జరిగే వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడటం రేణుకి అలవాటు. పవన్‌తో వైవాహిక జీవితం , విడాకులు, పిల్లల పెంపకం ఇలా తన జోలికి వచ్చిన వాళ్లకి కౌంటర్ ఇస్తుంది.

కాగా.. ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియాలోనూ, బహిరంగంగాను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. బూతులు , వల్గర్ కామెంట్స్‌తో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ఫేమస్ అయిన ఇండియా గాట్ లాలెంట్ షోలో రణ్‌వీర్ అల్లాబాడియా అనే యూట్యూబర్, సమయ్ రైనా, అపూర్వ ముఖిజలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఓ లేడీ కంటెస్టెంట్‌ను, వారి తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితంపై రాయలేని విధంగా అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ మాటలకు షోకు హాజరైన వారంతా షాక్ అయ్యారు.

Pawan kalyan ex wife renu desai fires on ranveer allahbadia over his comments at india s got latent

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించారు. మీ పిల్లలను జాగ్రత్తగా, పద్ధతిగా పెంచాలని , రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌ను దూరం పెట్టి వారిని అన్‌ఫాలో చేయాలని సూచించారు. యువత బాధ్యతగా వ్యవహరించాలని.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కుని దుర్వినియోగం చేస్తున్నారని రేణూ దేశాయ్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఇప్పటికే తాను మాట్లాడిన మాటలకు రణ్‌వీర్ క్షమాపణలు చెప్పాడు. అయితే ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు.

More from Filmibeat

Read more about: pawan kalyan renu desai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X