అకీరా ఇక మొదలెట్టేశాడు.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన పవర్ ప్రిన్స్ - ఈ వైరల్ పోస్ట్ చూశారా!​

పవన్ కళ్యాణ్​తో విడిపోయిన తర్వాత నటి రేణు దేశాయ్ ఒంటరిగానే ఉంటూ తన పిల్లల భాద్యతలను ఎంతో చక్కగా చూసుకుంటోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటూ తన పిల్లల గురించి అనేక విశేషాలను పంచుకుంటోంది. అదే సమయంలో అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలోనూ వారిపై ఫోకస్ ఎక్కువగా పెరుగుతోంది.

వారికి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన ఇట్టే వైరల్ అయిపోతంది. అయితే తాజాగా అకీరా గురించి రేణు ఓ పోస్ట్ చేసింది. అందులో పవన్ పోలీకలతో ఉన్న అకీరాను చూస్తే ట్రెండ్ సెట్ చేయడం మొదలుపెట్టేశాడనే చెప్పాలి! ప్రస్తుతం అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూరి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

 Pawan Kalyan Ex Wife Renu Desai Shared Power Prince Akira Nandan Trend Set Photo Goes Viral


సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ :
ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఫోకస్ అంతా ఇద్దరిపైనే ఎక్కువగా ఉంది. అది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ, పవన్ వారసుడు అకీర సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపైనే. వీరిద్దరు ఎప్పుడెప్పుడు వస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అకీరాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 Pawan Kalyan Ex Wife Renu Desai Shared Power Prince Akira Nandan Trend Set Photo Goes Viral

మెగా ఫ్యామిలీకి దగ్గరగా :
నటి రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లల గురించే పెడుతుంది. వారు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వారి టాలెంట్ ఏంటి? ఇలా చాలా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో వారిని ఎక్కువగా మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరగా ఉంచుతోంది. ఫ్యామిలీ ఫంక్షన్స్​కు ఎక్కువగా పంపుతోంది. అయితే తాజాగా అకీరాకు సంబంధించిన ఓ పోస్ట్ చేసింది.

ట్రెండ్ సెట్ చేస్తున్నాడు :
అందులో అకీరా బిస్కెట్ కలర్​ ప్యాంటు, ఎర్ర చొక్కా వేసుకుని నేచురల్​ లుక్​లో ఎంతో స్టైలిష్​గా కనిపించాడు . అచ్చం తన తండ్రి పోలికలతో వింటేజ్ పవన్​లా కనిపించి మరోసారి ఆకట్టుకున్నాడు. చెప్పులు కూడా తన తండ్రి పవన్ ధరించే లాంటివే వేసుకుని సింపుల్​గా కనిపించాడు. అదే సమయంలో వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు అకీర ఇక మళ్లీ కొత్త ట్రెండ్​ సెట్ చేయడం మొదలుపెట్టేశాడని తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఎంతో సంతోషంగా ఉంది :
ఇకపోతే ఈ పిక్​ను షేర్ చేసిన నటి రేణూ.. అకీరా, ఆద్యాను ఓల్డ్​ వైర్​ ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడాలని చెబుతున్నాను. ఎందుకంటే బ్లూటూత్​ టెక్నాలజీ వల్ల మెదడు, చెవులుపై ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అకీరా క్రమక్రమంగా ఫ్యాన్సీ హెడ్​ ఫోన్స్​ వినియోగాన్ని ఆపేసి ఈ వైర్ ఇయర్ ఫోన్స్​ వాడటం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అంటూ రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X