Pawan Kalyan Fan: బ్లేడుతో కోసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్.. ఇదేం పిచ్చి బ్రో!
హీరోలను అభిమానులకు ఎంతగా ప్రేమిస్తారో చెప్పేందుకు ఎన్నో ఉదాహరణల ఉన్నాయి. వారిపై చూపించే ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది. ఒక్కోసారి అభిమానుల మధ్య గొడవలు ప్రాణాలు తీసిన దాఖలాలు సైతం ఉన్నాయి. అభిమాన హీరోల కోసం రక్తదానాలు, సహాయక పనలు వంటివి కొంతమంది చేస్తే.. మరికొంతమంది ప్రవర్తన మాత్రం విచిత్రంగా, పిచ్చిగా అనిపిస్తుంటుంది. అలాంటి సంఘటనే తాజాగా మదనపల్లిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కల్యాణ్ స్పీచులు, సినిమాలు, ఆయన కనిపిస్తే చాలు ఈలలు, గోలతో మారుమోగిపోతుంది. ఇక సినిమా విడుదలైతే థియేటర్లు బద్దలైపోతాయి, సీట్లు చిరిగిపోతాయి.. హాల్ అంతా సీఎం అంటూ మారుమోగిపోతోంది. అలాంటి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ నుంచి తాజాగా వచ్చిన సినిమానే బ్రో (Bro Movie).

పవన్ కల్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా బ్రో. దీనికి నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించగా.. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించిన ఈ సినిమాలో రొమాంటిక్ భామ కేతికా శర్మ, వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. బాలీవుడ్ బ్యూటి ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్ చేసింది.
ఎన్నో అంచనాలతో, అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన బ్రో మూవీ జూలై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ, అభిమానులకు మాత్రం బ్రో తెగ నచ్చేసింది. ఇందులో పవన్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ అభిమానమే ఓ ఫ్యాన్ కు పిచ్చోడిలా ప్రవర్తించేలా చేసింది. పవన్ కల్యాణ్ పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ బ్లేడుతో చేయి కోసుకున్నాడు ఓ ఫ్యాన్.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఓ థియేటర్ ముందు పవన్ అభిమాని బ్లేడుతో చేతిని పలుమార్లు కోసుకుంటూ హల్ చల్ చేశాడు. పవన్ కల్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ చెప్పాడు. "పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ చాలా బాగా చేశారు. బ్రో సినిమా హిట్ బ్రో. మా అన్న.. అన్నకోసం చచ్చిపోతా" అంటూ రక్తంతో పవన్ కల్యాణ్ పోస్టర్ కు బొట్టు కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications










