Fan War: అల్లు అర్జున్.. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా ఒకే.. పుష్ప జగదీష్ మర్డర్ కేసు సంగతేంటి? ఏకిపారేస్తున్న ప
జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు వ్యవహారం మరోసారి పవన్ కల్యాణ్, మెగా ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య చిచ్చు పెట్టింది. తనపై లైంగిక దాడి పాల్పడ్డారంటూ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ ఫిర్యాదు చేయడం తెలుగు సినిమా రంగాన్ని మరోసారి కుదిపేసింది. అయితే ఈ వ్యవహారంలో బాధితురాలికి పెద్ద హీరో (అల్లు అర్జున్) సపోర్టుగా నిలిచారనే విషయంపై అనేక వాగ్వాదాలకు దారి తీసింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. ఆ వార్ వివరాల్లోకి వెళితే..
జానీ మాస్టర్ బాధితురాలి విషయం తెలుసుకొని ఓ పెద్ద హీరో తన మేనేజర్‌ను ఆమె వద్దకు పంపించారు. ఆమె పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన చేస్తున్న సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తమ సంస్థలో రూపొందే సినిమాల్లో కూడా ఆఫర్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అని యాంకర్ ఝాన్సీ వివరించింది.

అయితే జనసేనలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్‌తో అంతర్గత విభేదాల కారణంగా బాధితురాలికి సపోర్ట్ ఇచ్చారనే చర్చ వెంటనే సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఓ మహిళకు అల్లు అర్జున్ అండగా నిలిచి మంచి పనే చేశారు. కానీ అందరి విషయంలో ఆయన సమన్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? ఓ మహిళ సూసైడ్ కారణమైన పుష్ప ఫేమ్ జగదీష్ విషయంలో బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు అని ఘాటుగా ప్రశ్నిస్తూ ట్రోల్ చేశారు.
గతంలో పుష్ప ఫేమ్ జగదీష్ ఓ మహిళ ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అయితే పుష్ప 2 సినిమాలో జగదీష్ పాత్ర కీలకంగా మారడంతో ఆయనను టీమ్ బెయిల్‌పై విడిపించి షూటింగ్ పూర్తి చేసుకొన్నారు. జగదీష్ వల్ల అన్యాయానికి గురైన బాధిత కుటుంబాన్ని అప్పుడు ఎందుకు అల్లు అర్జున్ పట్టించుకోలేదు అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే జానీ మాస్టర్, జగదీష్ కేసు విషయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సరిగా లేదు. తన సినిమాలో పనిచేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు విషయంలో ఒకలా? మరోకరి విషయంలో ఒకలా వ్యవహరించడం సరికాదు అనే వాగ్వాదం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది.


Click it and Unblock the Notifications











