Akhira Nandan Cutout: అకీరా నందన్ రికార్డ్.. హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ తనయుడి హవా

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల్లో వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నారు. 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు : పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. పలు థియేటర్లను అభిమానులు మస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ వైబ్ మొదలైంది. కాగా హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమయంలో అకీరా నందన్ కటౌట్ లు కనిపించడం హాట్ టాపిక్ గ్గా మారింది..

భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు..
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూ.250 కోట్లతో నిర్మించారు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం వల్ల పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం రత్నం మెగా ఫోన్ పట్టుకున్నారు. పూర్తి సినిమాను డైరెక్ట్ చేశారు.

Pawan kalyan Fans Arranged Akhira Nandan huge Cutout

3 రోజుల్లో విడుదల..
హరి హర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కారణం.. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అటు ఎమ్మెల్యేగా, ఇటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 3 రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి.

అకీరా నందన్ కటౌట్..
ఈ క్రమంలోనే థియేటర్లను ముస్తాబు చేస్తున్నారు. కాగా పలు థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే ముందే తనయుడు అకీరా నందన్ కటౌట్ లను ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. తండ్రి సినిమాకు కొడుకు కటౌట్ ఏర్పాటు చేయడం రికార్డు గా మారింది. ఈ విషయంలో అకీరా నందన్ సెన్సేషన్ గా మారారు. ఇప్పటికే అకీరా నందన్ డెబ్యూ ఫిల్మ్ ఎప్పుడు ఉంటుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా కటౌట్ పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక హరి హర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనసూయ, వర్ష బొల్లమ స్పెషల్ సాంగ్ లో నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం విశేషం. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X