Don't Miss!
- News
`అందులో తెలంగాణ సీఎం కూడా భాగస్వామే`: బాంబు పేల్చిన చంద్రబాబు: రామ్ మాధవ్ ఏం చెబుతారు?
- Finance
pak debts: IMF ముందు బోర్లా పడిన పాకిస్థాన్.. బెయిలౌట్ బాటలో మరో ఎదురుదెబ్బ
- Lifestyle
Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mega, Nandamuri అభిమానుల్లో అన్‌స్టాపబుల్ చిచ్చు.. అమెరికాలో పవన్ ఫ్యాన్స్‌పై దాడి.. బాలకృష్ణ అభిమాని అరెస్ట్!
అమెరికాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వాగ్వాదం కొత్త సంవత్సరంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది. 2022 సంవత్సరం ముగింపు వేడుకల్లో పవన్, బాలయ్య అభిమానుల మధ్య చోటు చేసుకొన్న వాగ్వాదం భారీ ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా రెండు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడి చేసుకోవడం దిగ్బ్రాంతిని కలిగించింది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఘర్షణ, వాగ్వాదం వివరాల్లోకి వెళితే..

2022 ముగింపు వేడుకల్లో గొడవలు
2022 సంవత్సరానికి ముగింపు చెబుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ డల్తాస్ నగరంలో భారీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రవాసాంధ్రులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా నందమూరి, మెగా అభిమానుల మధ్య అన్‌స్టాపబుల్ 2 టాక్ షోపై చిన్నగా వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దాంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో దాడులకు దారి తీసింది.

నందమూరి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అధిపత్య పోరు
నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య అధిపత్యపోరు డల్లాస్ ఘర్షణ సంఘటనకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. టెక్సాస్ రాష్ట్రంలో భారీగా ఉన్న ప్రవాసాంధ్రులకు సినీ తారలకు సంబంధించి పెద్ద ఎత్తున్న అభిమాన సంఘాలు ఉన్నాయి. గతంలో కూడా వారి మధ్య వాగ్వాద సంఘటనలు చోటుచేసుకొన్నాయి. కానీ అవి టీ కప్పులో తుఫాన్ మాదిరిగానే సమసిపోయాయి అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
|
బాలకృష్ణ వాడిన పరుష పదజాలంతో రచ్చ
మెగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ వాడిన పరుష పదజాలాన్ని ఎత్తి చూపుతూ పవన్ కల్యాణ్ అభిమానులను నందమూరి అభిమానులు అవమానించేందుకు ప్రయత్నించారు. అయితే వారి వాదనలను పవన్ ఫ్యాన్స్ అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ రెండు వర్గాలు వెనుకకు తగ్గకుపోవడంతో తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకొన్నదని స్థానిక అభిమానులు తెలిపారు.

అన్‌స్టాపబుల్ 2 చిచ్చు
పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య నెలకొన్న వాగ్వాదం సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను నందమూరి అభిమానులు చించివేయడంతో అగ్రహం చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిదాడికి దిగారు. బాలకృష్ణ చీకొట్టినా అన్‌స్టాపబుల్ 2 షోకు పవన్ రావడం సిగ్గుచేటు అనే విధంగా మాట్లాడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు అని వేడుకుకు హాజరైన అభిమానులు తెలిపారు.

బాలకృష్ణ అభిమాని అరెస్ట్
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం శృతిమించి.. మాటల నుంచి చేతల వరకు వెళ్లడంతో ఈవెంట్ మేనేజర్లు జోక్యం చేసుకొన్నారు. అయినా పరిస్థితి అదుపు తప్పడంతో వారిని ఆపడం తలకు మించిన భారమైంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరకొట్టారు. ఆ తర్వాత దాడి ఘటనకు కారణమైన బాలకృష్ణ అభిమాని కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు.

పవన్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య రాజీకి తానా నేతలు
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై దాడికి ప్రయత్నించిన బాలకృష్ణ అభిమానిని డల్లాస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ వివాదం గురించి తెలుసుకొన్న తానా నేతలు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీ చేకూరి బెయిల్ కోసం నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అభిమానులు మధ్య గొడవ స్థానిక ప్రవాసాంధ్రులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.