పోసానిపై దాడియత్నం.. నాకేమైనా అయితే.. నా చావుకు కారణం పవన్ కల్యాణే.. పోసాని సంచలన వ్యాఖ్యలు
పోస్టర్ పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం మీద అనుచితమైన కామెంట్స్ చేస్తూ మెసేజ్ లు చేస్తున్నారు అని చెబుతూ పోసాని కృష్ణమురళి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయగా మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. అయినా సరే పోసాని కృష్ణ మురళి ఎక్కడ తగ్గకుండా పవన్ కళ్యాణ్ ను అనేక మాటలు అన్నారు.. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకున్నారు.. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి మీద దాడి జరుగుతుండగా పోలీసులు అడ్డుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అరెస్ట్ చేసి తరలించారు. ఆ వివరాల్లోకి వెళితే

పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు గాను కౌంటర్ ఇచ్చేందుకు నిన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక కామెంట్స్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేయడంతో పెను సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహారం అక్కడితో సమసిపోతుంది అని భావిస్తే ఈరోజు సాయంత్రం 5:30 కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు పోసాని కృష్ణ మురళి.. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమే కాక పవన్ కళ్యాణ్ అభిమానులు తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెబుతూ పవన్ కళ్యాణ్ మీద ఆయన దారుణమైన కామెంట్స్ చేశారు.. జగన్ అనే ఒక నాయకుడిని అభిమానించే వ్యక్తిగా తాను పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే తన కుటుంబ సభ్యులను ఈ వ్యవహారంలో కి లాక్కొచ్చి అలాంటి మాటలు మాట్లాడతారా అని ప్రశ్నించారు.

పవన్ భార్య గురించి తప్పుగా
తన భార్యతో ఎవరికో అక్రమ సంబంధం ఉందంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త కొత్త కథలు సృష్టిస్తున్నారని ఆ మాట అంటే తాను కూడా పవన్ భార్య గురించి తప్పుగా మాట్లాడగలను అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు పోసాని కృష్ణ మురళి ని ఆపడం తో ఆయన కాస్త ఎమోషనల్ అయినా ఆ విషయంలో వెనక్కి తగ్గారు.. అయితే అప్పటికే అనాల్సిన మాటలు అన్నీ అనడంతో పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలంగాణ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అయితే పోసాని మీద దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్న అభిమానులు పోసాని వద్దకు దూసుకెళ్లబోతుండగా వాళ్లందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చంపించాలని చూస్తున్నారు
అయితే అంతకు ముందు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన చంపించాలని చూస్తున్నారని ఈ విషయం మీద తనకు సమాచారం ఉందని ఆయన అన్నారు. తన ప్రాణానికి ఏం జరిగినా దానికి పవన్ కళ్యాణ్ కారణమని ఆయన అన్నారు. అలాగే ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గురించి తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని రేపు పవన్ కళ్యాణ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని పోసాని కృష్ణమురళి అన్నారు.

పోసాని సొంత కారులో
అయితే ఇక్కడ కంప్లైంట్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తారా అంటే ఎక్కడ చెల్లుబాటు అవుతుందో అక్కడ ఫిర్యాదు చేస్తానని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినా మళ్ళీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉండడంతో పోసాని సొంత కారులో ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు.
Recommended Video

పోలీసుల ఫిర్యాదుతో
కాసేపు పరిస్థితి సద్దుమణిగితే ఆయన ఇంటికి వెళ్లే అవకాశం ఇద్దాం అని అనుకున్నారు కానీ ఎంతసేపటికీ పరిస్థితి సద్దుమణిగే అవకాశం లేకపోవడంతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటూనే ఉండడంతో పోలీసులు తమ వాహనంలో పోసాని కృష్ణమురళి ఆయన ఇంటికి తరలించారు. అయితే తనకు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ కి బాధ్యత అని పోసాని కృష్ణమురళి ప్రకటించడంతో పాటు కేసు పెడతానని ప్రకటించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక పోసాని కృష్ణమురళి ఇంటికి కూడా పోలీసు భద్రత కోరినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేసే విషయం మీద పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించినట్లు సమాచారం. అయితే అరెస్టయిన పవన్ అభిమానులు తాము జనసేన కార్యకర్తలమని పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పూర్తయ్యాక ఆయన గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడానికి అక్కడకు వెళితే తమను అన్యాయంగా అరెస్టు చేసి తెలంగాణ పోలీసులు ఎక్కడికో తీసుకువెళ్తున్నారు అని చెబుతూ పోలీస్ జీప్ లో ఉన్న వీడియోలు కొన్ని విడుదల చేశారు. అయితే ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











