AP Elections వంగా గీత గారు.. గాజు గ్లాసుకు ఓటెయ్యండి.. క్యూలైన్‌లో వైసీపీ అభ్యర్థికి మాస్ ర్యాగింగ్!

రాజకీయాల్లో ఎన్నికలంటేనే అధిపత్యం.. గెలుపే లక్ష్యం. అయితే అందుకోసం పోలిటిషియన్ ఎంతకైనా తెగిస్తారు. అయితే ప్రత్యర్థులపై పైచేయి సాధించడం పెద్ద టాస్కే. కానీ పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీతకు ఎదురైన పరిస్థితి చూస్తే.. భగవంతుడా? ఈ పరిస్థితి ఎవరికి రావొద్దనే అభిప్రాయం, బాధ కలుగుతుంది. అయితే పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వంగా గీతను ఓటర్లు ఎలా ర్యాగింగ్ చేశారనే విషయంలోకి వెళితే..

రాష్ట్రంలో ఎవరైనా గెలిచినా పర్వాలేదు. కానీ పిఠాపురంలో జనసేన అధినేత గెలువకూడదనేది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుక్తులు, కుయుక్తులు పన్నారు. ఆ ప్రాంతంలో విశేష రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను బరిలోకి దించారు. అయినా గెలుపు ఆమడదూరంలో ఉండటంతో తన పార్టీకి చెందిన ప్రముఖులు, ఉద్దండ నేతలను రంగంలోకి దించారు.

Pawan Kalyan fans mass Ragging on YSRCP s Pithapuram Candidate Vanga Geeta

అయినా పిఠాపురం పీఠాన్ని పవన్ కల్యాణ్‌ను నుంచి దూరం చేయలేమనే నమ్మకం బలంగా పెరగడంతో డబ్బు, బంగారం, ఇతర ప్రలోభాలకు గురి చేశారు. అయితే ఓటరు మాత్రం ఇలాంటి చిల్లర ప్రలోభాలకు మాత్రం లొంగలేదు. చివరకు స్టేజీ మీద వంగా గీత భోరున విలపించింది. ఆ తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే.. ఆమె డిప్యూటీ సీఎం అని ప్రకటించేశారు.

ఇక ఓటింగ్ రోజు వరకు వంగా గీత ఎక్కని మెట్టు లేదు.. దిగని గడపలేదు. చివరకు ఓటింగ్ రోజున ప్రతీ పోలింగ్ బూత్‌ను సందర్శించి నిబంధనలకు విరుద్ధంగా ఓటు కోసం ప్రాధేయపడటం కనిపించింది. కొన్ని చోట్ల జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా గెలుపు కష్టమే అనే ఫీలింగ్ ఆమెలో రోజు రోజుకు బలంగా నిలిచిపోయేలా సంఘటనలు చేశాయి.

ఇక ఓటింగ్ రోజున తన ఓటు వేసుకొనేందుకు వెళ్లిన వంగా గీతకు ఎవరికి ఎదురు కాని చేదు అనుభవం ఎదురైంది. క్యూలైన్‌లో నిలచున్న వైసీపీ అభ్యర్తిని ఏకంగా ఓటర్లు.. పవన్ కల్యాణ్‌కు, ఆయన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌కు ఓటు వేయమని రిక్వెస్ట్ చేయడం అంతకంటే దారుణం ఏముంటది చెప్పండి.

స్వయంగా వంగా గీతానే.. తనను గాజు గ్లాస్‌కు ఓటు వేయమని చెబుతున్నారని చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు గురించి పక్కన పెడితే.. మెజారీ ఏ రేంజ్ అనే చర్చ పిఠాపురంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో భారీగా జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X