‘వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీపై పవన్ ఫ్యాన్స్ స్వీట్ రివేంజ్.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా 78 శాతం యూత్’

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ బీజేపీ నేత వీకే నరేష్ సంచలన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అధికార పార్టీకి చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా తీవ్రమైన పదజాలంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. వీకే నరేష్ చేసిన తాజా ట్వీట్ వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ చేస్తున్న విమర్శలను వీకే నరేష్ తిప్పి కొడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణపై అధికార పార్టీ కార్యకర్తలు చేసిన ట్వీట్లను, సోషల్ మీడియా పోస్టులపై ఆయన ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులను అలగ జనం అంటూ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్ ఘాటుగా జవాబిస్తున్నారు.

Pawan Kalyan Fans Sweet Revenge on YSRCP Waiting for vengeance on YS Jagan

గత ఎన్నికల్లో మీరు అలగా జనంగా భావించే పవన్ కల్యాణ్ అభిమానులంతా మైనర్స్. కానీ ఈ ఎన్నికలకు వారంత మేజర్లు, ఓటర్లుగా మారారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీపై స్వీట్ రివేంజ్ తీసుకోబోవడమే కాకుండా.. స్వీట్ విక్టరీని కూడా జనం తీసుకొంటున్నారు అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఐపాక్ సర్వే సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో 22 శాతం మంది స్టూడెంట్స్ వైసీపీ ఓట్లు వేస్తే.. 78 శాతం మంది విద్యార్థులు కూటమికి ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు అని వీకే నరేష్ సర్వే ఫలితాలను బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

Pawan Kalyan Fans Sweet Revenge on YSRCP Waiting for vengeance on YS Jagan

2024 అసెంబ్లీ, పార్లమెంట్‌లో యువతదే ప్రధాన భూమిక. ఈ ఎన్నికల్లో యూత్ గేమ్ ఛేంజర్. నేను చేస్తున్న ఈ ట్వీట్‌ను, నా మాటలను గుర్తుంచుకొండి. జూన్ 3వ తేదీన నా మాటలు కచ్చితంగా నిజమవుతాయి అని వీకే నరేష్ బల్లగుద్ది చెబుతున్నారు. ఆయన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్‌ను ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏపీ భవిష్యత్ పవన్ కల్యాణ్. ఆంధ్రాకు టార్చ్ బేరర్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా స్వీట్ రివేంజ్ అంటూ కామెంట్ చేసిన ఆయన ఓ బ్రిడ్జీ పిల్లర్‌పై పవన్ కల్యాణ్ ఐ లవ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనే ఫోటోను ఆయన పోస్టు చేసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X