Bro: అమెరికాలో పవన్ కల్యాణ్ క్రేజ్.. వాటితో కళ్లు చెదిరేలా లైట్ షో 'బ్రో'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న పాపులారీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీగా అభిమానగనం ఉంది. ఓవైపు రాజకీయాల్లో, మరోవైపు సినిమాల్లో ఫుల్ జోష్ చూపిస్తున్నారు.

ఇక ఆయన సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మూవీ వస్తే పండుగలా ట్రీట్ చేస్తారు. అలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ బ్రో మూవీ (Bro Movie) రానున్న సందర్భంగా అమెరికాలో వినూత్నంగా అభిమానం చాటుకున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.

Pawan Kalyan Fans Wishes To Bro Movie With Tesla Cars In America

ఎన్నో అంచనాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా బ్రో. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఇక సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

బ్రో సినిమాను జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మై డియర్ మార్కండేయా, జాణవులే వంటి పాటలు మంచి హిట్స్ సాధించగా.. పవన్, సాయి తేజ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శనివారం సాయంత్రం విడుదలైన ట్రైలర్ కు అన్నిటికిమించి రెస్పాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ పండగు చేసుకుంటున్నారు.

Pawan Kalyan Fans Wishes To Bro Movie With Tesla Cars In America

జూలై 25 హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో సినిమా వస్తుందన్న సంతోషంతో అభిమానులు వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. అది కూడా అమెరికాలో నిర్వహించారు.

అమెరికాలోని పవన్ ఫ్యాన్స్ డల్లాస్ లో టెస్లా కార్లను బ్రో సినిమా ఇంగ్లీష్ లెటర్స్ ఆకారంలో పార్క్ చేసి అభిమానం చాటారు. టెస్లా కార్లతో బ్రో టైటిల్ లైట్ షో చేశారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోలో టెస్లా కార్ల లైటింగ్ తో బ్రో ఆకారంలో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X