Pawan kalyanకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వెనుక నుంచి వచ్చి అలా చేయడంతో కారు మీదే పడి?(video)
అభిమానుల అత్యుత్సాహానికి సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని..వారితో సెల్ఫీలు దిగాలని అభిమానులు ప్రయత్నిస్తుంటారు. ఈ సందర్భంగా అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ అభిమాని చేసిన అత్యుత్సాహం పవన్ కళ్యాణ్ కింద పడేలా చేసింది. కొంచెంలో కొంచెం తమాయించుకున్నారు కానీ లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. పవన్ కారు మీద నుంచి కింద పడిపోయే వారు. ఆ వివరాల్లోకి వెళితే

217 జీవో జారీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల కోసం రంగంలోకి దిగారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నా 217 జీవోపై గళం ఎత్తడానికి 'మత్స్యకార అభ్యున్నతి సభ'ను నిర్వహిస్తున్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారని, మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ ముందు నుంచి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారుల అధికారులు తొలగించేలా వారి ఉపాధికి దెబ్బతీసేలా 217 జీవోను జారీ చేసింది .

మత్స్యకారుల డిమాండ్
మత్స్యకార సొసైటీల పేరుతో చేపల చెరువులన్నీ దళారీల చేతిలో ఉన్నాయని అందుకే 217 జీవో ద్వారా వేలం వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ 217 జీవో మీద మత్స్యకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో మత్స్యకారులకు నష్టం చేసేదిగా ఉందని, వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మత్స్యకారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

ఘన స్వాగతం
ఈ క్రమంలోనే మత్స్యకారుల పక్షాన పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో 'మత్సకార అభ్యున్నతి సభ' నిర్వహిస్తున్నారు. మత్స్యకార అభ్యున్నతి సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. నర్సాపురంలో జరిగే జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి సభ కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా పవన్ కల్యాణ్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

భారీ సంఖ్యలో
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నర్సాపురం చేరుకుంటారు. ఈ సభ వరకు పవన్ ర్యాలీగా వెళుతున్నారు. ఈక్రమంలోనే వన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో ర్యాలీకి వచ్చారు. ర్యాలీలో వెళుతున్న ఆయనని కనీసం చూడవచ్చి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఊర్ల వారు కూడా అక్కడికి చేరుకున్నారు.
Recommended Video
కారు మీద నుంచి
దీంతో ముందు కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారు పైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పవన్ కింద పడిపోయిన పరిస్థితి కనిపించింది. కొంచెం తమాయించుకున్నారు కానీ లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. పవన్ కారు మీద నుంచి కింద పడిపోయే వారు. ఈ హఠాత్ పరిణామాలతో పవన్ కొన్ని క్షణాల పాటు కారుపైనే కూర్చుని ఉండి పోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











