తమన్‌ను ఫాలో అవుతున్న పవర్ స్టార్.. గాల్లో తేలిపోతోన్న మ్యూజిక్ డైరెక్టర్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఈ మధ్య తెగ వినిపిస్తోంది. కాదు కాదు.. ఆయన సంగీతం వినిపిస్తోంది. మనసుకు హత్తుకునే సంగీతాన్ని అందించడంతో ఆయన పేరు మార్మోగిపోతోంది. వరుసగా బ్లాక్ బస్టర్ ఆడియోను అందిస్తూ తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ అంటే తమన్‌కు ఎంత ఇష్టమన్నది ఆయన ట్వీట్స్ చూస్తుంటూనే అర్థమవుతుంది. వకీల్ సాబ్‌కు పాటలు అందిస్తున్న క్షణం నుంచి పవర్ స్టార్ గురించి ఏదో రకంగా ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. ఆయనపై ఉన్న ప్రేమను తెలియపరుస్తూనే ఉన్నాడు. ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే సమయంలో తమన్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇక తన ప్రేమనంతా రంగరించి ఫస్ట్ సింగిల్‌ను కంపోజ్ చేశానని తెలిపాడు. దానికి తగ్గట్టే మగువా మగువా పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తమన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా తమన్‌ను ఫాలో అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని తెలుపుతూ తమన్ ఎమోషనల్ అయ్యాడు. అతి పెద్ద ఫ్యాన్ మూమెంట్.. ఇంతకంటే గొప్పగా రోజు ప్రారంభం కాదంటూ గాల్లో తేలిపోయాడు.


Click it and Unblock the Notifications











