Bro: వైష్ణవ్ తేజ్‌పై చిరాకు పడ్డ పవన్ కల్యాణ్.. వాళ్ల పేర్లు చెప్పడంతో అసహనం
ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఆయన స్పీచ్ లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలిటిక్స్, సినిమాలు ఏదైనా సరే తనదైన మాటలతో అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఆయన తాజాగా నటించిన చిత్రం బ్రో (Bro Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 25న హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై దాదాపు 30 నిమిషాలపాటు తన స్పీచ్ అదరగొట్టారు పవన్ కల్యాణ్. కానీ, మధ్యలో ఒక్కసారిగా ఊహించనివిధంగా ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్‌పై చిరాకు పడిపోయారు పవర్ స్టార్.
సాంకేతికవర్గం:మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తమన్ మ్యూజిక్ చేశారు.

ఎవరెవరు వచ్చారంటే?:జూలై 25న శిల్పాకళా వేదికలో జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ విచ్చేశారు. సుమ యాంకరింగ్ చేసిన ఈ కార్యక్రమానికి హీరోలు పవన్, సాయి తేజ్ తోపాటు సముద్ర ఖని, బ్రహ్మానందం, నిర్మాతలు, హీరోయిన్లు ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ, ఊర్వశీ రౌటెలా, సీనియర్ నటి రోహిణి, తమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
చిటీ తీసి:బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ఘ స్పీచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే ఈ కార్యక్రమంలో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ పేరు గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చిట్టీ రాసుకొచ్చారు. ముందుగానే ఆ చిట్టి చూసిన పవన్ కల్యాణ్ డైరెక్టర్ సముద్ర ఖని, సాయి ధరమ్ తేజ్ గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడారు. అనంతరం జేబులో నుంచి చిటీ తీసి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చారు.

గుర్తుండవు:మణిశర్మ దగ్గర తమన్ పని చేయడం నుంచి తెలుసుని పవన్ తెలిపారు. ఆయనతో వకీల్ సాబ్ సినిమా చేశాం. అదే కదా అంటూ ఆయన్నే అడిగి కన్ఫర్మ్ చేసుకుని చెప్పారు. పాలిటిక్స్ గుర్తుంటాయి కానీ, ఇవన్నీ అంతగా గుర్తుండవు అని తెలిపారు. తమన్ తో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చేశాను. ఇప్పుడు బ్రోతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని పవన్ కల్యాణ్ తెలిపాడు. తర్వాత టెక్నిషియన్స్, హీరోయిన్స్, నటుల పేర్లు ఒక్కొక్కరిగా చెబుతూ వచ్చారు.

సాయి తేజ్ వైపు:అందరి పేర్లు చెప్పిన తర్వాత మళ్లీ సాయి ధరమ్ తేజ్ వైపు వెళ్లింది పవన్ కల్యాణ్ ప్రసంగం. సాయి తేజ్ యాక్సిడెంట్, కోమాలోకి వెళ్లడం, అప్పటి పరిస్థితి, సాయి తేజ్ ను కాపాడిన అబ్దుల్ కు కృతజ్ఞతలు తెలపడం వంటివి చాలా మాట్లాడారు పవన్ కల్యాణ్. అనంతరం ప్రసంగం మధ్యలో పవన్ కల్యాణ్ వెనుకే నిల్చుని ఉన్న వైష్ణవ్ తేజ్ ఒక సిగ్నల్ ఇచ్చాడు.
అసహనం:నిర్మాతల గురించి చెప్పండని అన్నట్లుగా వైష్ణవ్ తేజ్ గుర్తు చేశాడు. అది విన్న పవన్ కల్యాణ్ వెనక్కి తిరిగి కాస్తా చిరాకుగా అసహనం వ్యక్తం చేశాడు. 'చెబుతా' అన్న పవన్ కల్యాణ్.. 'నాకుతెలుసు. నేను మరిచిపోను' అన్నట్లుగా చేతి కవలిక ద్వారా చూపించాడు. 'నిర్మాతల గురించి ఎలా మర్చిపోతాను. ఈ సినిమాను ఇంత ఫాస్ట్ గా తీయడానికి కారణం విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల గారే కారణం. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు' అని పవన్ కల్యాణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











