పవర్ స్టార్‌ను హర్ట్ చేసిన సుమ.. ఆ మాటలు బాధించాయంటూ పవన్ ఆవేదన..
Pawan Kalyan -Suma: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉగాది కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ చేయగా, ఆమెతో పవన్ కళ్యాణ్ చేసిన సరదా సంభాషణలు, ఆమెను పవన కళ్యాన్ ఆటపట్టించిన తీరు ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచాయి. సుమ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ తన స్టైల్లో పంచ్‌లు వేయడంతో అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట యాంకర్ సుమ.. 'అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు.. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటి సార్?'అని ప్రశ్నించగా.. 'అప్పట్లో అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే 1940లో 1950లో అనేనా?'అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా తిరిగి ప్రశ్నించారు.'మీరు ఎలా మాట్లాడుతున్నారంటే.. రాజ్ కపూర్ గారితో కలిసి నటించినట్లు ఉంది. తిప్పి కొడితే మొన్ననే కదా. నేను సినిమాలు చేసింది. నేను ఎస్వీ రంగారావు గారు, కన్నాంబ గారు ,ఎన్టీఆర్ గారితో కలిసి నటించినట్లుగా మాట్లాడుతున్నారు" అంటూ సుమపై ఫన్నీ కౌంటర్స్ వేశారు.

ఆ విషయాన్ని అక్కడితో విడిచిపెట్టక..'సుమగారు మాట్లాడుతుంటే నన్ను క్రీస్తుపూర్వం కాలానికి పంపేశారు. ఈ మధ్యనే 'ఓజీ' సినిమా వచ్చిందని మీరు మర్చిపోయారు. నేను రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడం వల్ల ఇలా చాలా వెనక్కి తీసుకెళ్లడం మాత్రం భావ్యం కాదనీ, బల్లగుద్ది మరీ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సుమ గారి మాటలు నాకు బాధ కలిగిస్తున్నాయి' అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా అన్నారు. ఇలా ఫన్నీగా చెప్పడంతో అక్కడున్న అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు.
అలాగే సినిమా పట్ల తనకున్న ప్రేమ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 'సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా. ప్రజలకు సేవ చేసే గుర్తింపును ఇచ్చింది కూడా సినిమా. అందుకే నిర్మాతలు బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. సినిమా చూడడానికి ఉత్సాహంగా వచ్చే అభిమానులు ఆనందంగా వెళ్లాలి అనేది నా కోరిక' అని అన్నారు. సినిమా కలెక్షన్ల గురించి తాను ఎక్కువగా ఆలోచించనని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. 'సినిమా రిలీజ్ సమయంలో కలెక్షన్లు ఎంత వచ్చాయి, ఎలా నడుస్తోంది అనే విషయాలు నేను ఎక్కువగా అడగను. అది ఎవరి సినిమా అయినా సరే.. సినిమా బాగుండాలి అనేదే నా అభిలాష'అని చెప్పారు.
అలాగే సినిమాలను ప్రాంతాల వారీగా కాకుండా భారతీయ సినిమా అనే దృక్కోణంలో చూడాలని సూచించారు. 'ఇది ఇండియన్ సినిమా... భారతీయ చిత్ర పరిశ్రమ. ఆ పరిశ్రమలో నేను కూడా భాగస్వామిగా ఉండడం నాకు గర్వంగా ఉంది' అని అన్నారు. ఇక చివరిగా తనదైన స్టైల్లో మరోసారి సుమపై సరదా పంచ్ వేశారు. 'సుమగారు చెప్పినట్లుగా చాలా దశాబ్దాల క్రితం... అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు... మీకు గుర్తుండి ఉండే ఉంటుంది కదా, కొన్ని శతాబ్దాల క్రితం. ఆ మర్చిపోయిన భావనను తిరిగి ఈ సినిమాలో హరీష్ శంకర్ తీసుకువచ్చారు' అంటూ ఓల్డ్ ఏజ్ వాయిస్‌లో మాట్లాడి అందరినీ నవ్వించారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వరుస సరదా వ్యాఖ్యలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైలెట్‌గా మారాయి. ఆయన స్పీచ్‌లోని ఈ ఫన్నీ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











