అకీరా నందన్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. ఆ విషయాల్లో మెరుగయ్యాకనే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక జూలై 21న ఉదయం హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీడియాకు, హరి హర వీరమల్లు చిత్ర యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగానే తనయుడు అకీరా నందన్ తొలి చిత్రం గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఉదయం ప్రెస్ మీట్.. సాయంత్రం ప్రీ రిలీజ్ డేట్..
హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్, రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. నార్మల్ గా తన చిత్రాలకు సంబంధించిన రీలీజ్ విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తన పొలిటికల్ కెరీయర్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో నిర్మాత ఏఎం రత్నం ఎంతో కష్టపడ్డారని, పలు సమస్యలను ఎదుర్కున్నారు కూడానూ. అందుకే పవన్ కళ్యాణ్ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి నిర్మాత ఏఎం రత్నంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అకీరా నందన్ ఎంట్రీపై..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటం కారణం మున్ముందు సినిమాలు చేస్తారో లేదో అన్నది క్లారిటీ లేదు. మరోవైపు ఆయనకు ప్రధాన ఆదాయ వనరు సినిమాలే కావడంతో చెప్పలేమంటున్నారు. ఈ క్రమంలో తనయుడు అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులతో పాటు ఆడియెన్స్ లోనూ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తారంటూ వేచి చూస్తున్నారు. అయితే అకీరాకు నటనకంటే మ్యూజిక్ పైన చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మరి అకీరా సినిమా ఎంట్రీ పక్కానా కాదా అనే సందేహాలు ఓ మూల వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ అకీరా సినిమాల్లోకి రావడం పక్కా అని పరోక్షంగా తెలియజేశారు. సినిమాల్లో ఎదగాలంటే చిరంజీవి కొడుకునైనా, ఇంకెవ్వరి చుట్టమైనా, ఆఖరికి నా కొడుకుకైనా టాలెంట్ ఉండాల్సిందేనని, టాలెంట్ లేకుండా ఎవ్వరు ఎదగలేరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన కొడుకు అంటూ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై స్పష్టత లేదు. ప్రముఖ నిర్మాతలు మాత్రం అకీరా నందన్ ను లాంచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ లో ఇప్పటికే టచ్ లో ఉంటున్నారు.
ఇక హరి హర వీరమల్లు చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మించారు. ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా కథను క్రిష్ జాగర్లముడి అందించడం విశేషం. నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం విశేషం. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











