హరి హర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ ఫస్ట్ రివ్యూ.. అసలు ఎలా ఉందో తెలుసా?
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై మెరిసి దాదాపు 2 ఏళ్లు దాటింది. దీంతో పవనుడు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తాడా? అని అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ గా 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపైకి రాబోతున్నాడు. అది కూడా 'హరి హర వీరమల్లు' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. దీంతో ఈసినిమా విడుదల కోసం అభిమానులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ తన రివ్యూని కూడా ఇచ్చారని దర్శకుడు ఏఎం రత్నం చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
5 ఏళ్లు హరి హర వీరమల్లు షూటింగ్..
పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు చిత్రాన్ని మొదటగా దర్శకుడు క్రిష్ జాగర్లముడి ప్రారంభించారు. 2020లోనే షూట్ ప్రారంభించారు. అదే ఏడాది సెప్టెబర్ వరకు 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు ఉన్న కమిట్ మెంట్స్ తో మిగితా సినిమాల్లో బిజీగా అవ్వడం, 2022 వరకు ఆగుతూ సాగుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా పూర్తిగా ఆలస్యమైంది. పోలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన తర్వాత 2024 నవంబర్ లో మళ్లీ షూట్ ప్రారంభమైంది. ఎట్టకేళలకు 2025, మే 6తో షూటింగ్ ను పూర్తి చేశారు. ఇలా 5 ఏళ్ల పాటు షూటింగ్ పార్ట్ పూర్తవుతూనే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ ను కూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే విడుదల కాబోతోంది.

హరి హర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ రివ్యూ..
హరి హర వీరమ్లలు చిత్రం కత్తియుద్ధం, సాహసోపేతమైన వీరోచిత పాత్రలతో కూడింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో బందర్ పోర్ట్ గురించి ఒక స్పెషల్ సీక్వెన్ ను డిజైన్ చేశారంట. దాన్ని సీజీ వర్క్ రీక్రెట్ చేయటానికే 2 ఏళ్లు కష్టపడ్డామని దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పారు.
అయితే ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం, ముఖ్యంగా బందర్ సీక్వెన్స్ బాగా నచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారంట. అలాగే ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దారని అభినందించారని చెప్పారు. సాంగ్స్, ఫైట్స్ విషయంలో డీల్ చేసిన తీరుకు పవన్ సార్ ఫిదా అయ్యారని, మరో సినిమా చేసేందుకు కూడా అవకాశం ఇచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో ఒక సాంగ్ కూడా పాడారని చెప్పారు.
మళ్లీ వాయిదా.. ట్రైలర్ తో కొత్త రిలీజ్ డేట్..
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో హరి హర వీరమల్లు చిత్రం రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం 10 సార్లు వాయిదా పడింది. జూన్ 12న విడుదల కావాల్సిన చిత్రం మళ్లీ వాయిదా పడింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ తో పాటు కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











