1000 కళ్లున్నా చాలని మధుర ఘట్టం.. పవన్ కల్యాణ్‌కు మెగా ఆహ్వానం.. కాళ్లపై పడి పవర్ స్టార్ ఎమోషనల్

ఏపీలో కూటమిని విజయ పథాన నడిపించిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలీ అపూర్వమైన స్వాగతం పలికారు. పిఠాపురంతోపాటు కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే సంచలన విజయం తర్వాత పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవి నివాసానికి వచ్చి ఆశీస్సులు అందుకొన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలో ఎన్నో భావోద్వేగాలు, ఆనంద భాష్పాలు, ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల్లోనే కాకుండా ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించాయి. ఈ వీడియోలో ఆవిష్కృతమైన మధుర క్షణాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ సంచలన విజయం సాధించిన తర్వాత తొలిసారి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు, తన విజయాన్ని పంచుకొనేందుకు పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవి నివాసానికి వచ్చారు. ఆయనకు గులాబీ రెక్కలను ఆయనపై చల్లుతూ ఘనంగా స్వాగతం పలుకుతూ రాంచరణ్ ఇంటిలోకి తీసుకెళ్లారు. తనకు ఎదురుగా వచ్చిన వదిన సురేఖను భావోద్వేగంతో కౌగిలించుకొన్నారు.

Pawan Kalyan gets grand welcome by Ram Charan Chiranjeevi and mega family after Pithapuram Winning

ఇక ఇంట్లోకి వెళ్లగానే నేరుగా పవన్ కల్యాన్ తన మెగా సోదరుడు చిరంజీవి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత తన తమ్ముడిని కౌగిలించుకొని చిరంజీవి పైకి లేపి గాఢంగా కౌగిలించుకొన్నాడు. అనంతరం గజమాలను తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తూ మెడలో వేశారు. ఈ క్షణాలు మెగా అభిమానుల హ‌ృదయాలను కదిలించాయి.

Pawan Kalyan gets grand welcome by Ram Charan Chiranjeevi and mega family after Pithapuram Winning

ఇక ఇదిలా ఉండగా, తన తల్లి అంజనాదేవీ కాళ్లకు సాక్షాంగ నమస్కారం చేశారు. తన తల్లి ఓడిలో చేరి తన విజయాన్ని ఆనందంతో ఆస్వాదించారు. అలాగే వదిన సురేఖకు కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన వదినను కౌగిలించుకొని చిన్న పిల్లాడై పోయారు పవన్ కల్యాణ్. తల్లి, వదినలను తన హృదయానికి హత్తుకొంటూ పవన్ భావోద్వేగానికి గురయ్యాడు.

Pawan Kalyan gets grand welcome by Ram Charan Chiranjeevi and mega family after Pithapuram Winning

ఇక ఇంటికి వచ్చిన పవన్ కల్యాణ్, అన్నా లెజెనోవా, అఖిరా నందన్‌ను ఆహ్వానించి వారిచేత కేక్ కట్ చేయించారు. కేక్ కటింగ్ చేస్తుండగా.. అరవండి అంటూ చిరంజీవి అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం వారికి పట్టు వస్త్రాలు అందించి సన్మానం చేశారు. ఈ సంఘటనల్నీ అభిమానులకే కాదు.. సాధారణ ప్రజలను కూడా కదిలించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X