twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Trivikramకి పవన్ అరుదైన బహుమతి.. శ్రీశ్రీ ఆత్మ ఇక్కడికి వచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య సినిమాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మాట నిజమే అయినా తాజాగా ఈ స్నేహితులిద్దరూ కలిసి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున లెజెండరీ కవి రచయిత శ్రీశ్రీ గురించి చర్చించడాం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలిసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు గురించి వారు ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు అనే సందేహం అందరికీ ఉంటుంది. తాజాగా ఆ సందేహాన్ని కొంతవరకు తీర్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

     చర్చల మధ్య సినిమాలు

    చర్చల మధ్య సినిమాలు

    జనసేనాని పవన్, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణ ఒక ప్రవాహంలా సాగుతుంది. అయితే వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా? లేక రాజకీయాల గురించా? అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ గురించి బాగా తెలిసినవారు - ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు' అని అంటూ ఉంటారు. ఆ ఇద్దరితోనే ఆ మాట అంటే ఈ సాహితీ మిత్రులు కూడా సరదాగా 'ఔను... మేం సాహితీ చర్చల మధ్య సినిమాలు చేస్తుంటాం' అని అంటూ ఉంటారు.

    శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం

    శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం

    తాజాగా శ్రీశ్రీ గురించి వారి మధ్య చర్చ జరిగింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శుక్రవారం సాయంత్రం 'భీమ్లా నాయక్' సెట్లో మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి... పదాల పరుగులతో పోహళింపుతో చదువరులను చైతన్య పరచడం గురించి, యువతరం రక్తాన్ని వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కి జ్ఞాపికగా అందచేశారు.

    మీరు చెబితే వచ్చే అందం వే

    మీరు చెబితే వచ్చే అందం వే


    ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు ఇరువురూ చర్చించుకున్నారు. 'శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి... మీరు చెబితే వచ్చే అందం వేరు' అని త్రివిక్రమ్ ని పవన్ కల్యాణ్ కోరగా త్రివిక్రమ్ స్పందిస్తూ "కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది'' అని అన్నారు.

    ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం

    ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం

    అలా ''చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువారు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.. కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది" అన్నారు. దానికి పవన్ హృద్యంగా నవ్వడం కనిపించింది.

     ఆ శిఖరం దగ్గర గులక రాళ్లు

    ఆ శిఖరం దగ్గర గులక రాళ్లు


    అందుకు ఆయన స్పందిస్తూ 'ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది' అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందించి 'శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గర గులక రాళ్లు' అన్నారు. మొత్తం మీద ఈ మిత్రుల బహుమతి, ఆ బహుమతి అందుకున్న త్రివిక్రమ్ మాటలు మొత్తం మీద ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    English summary
    Pawan Kalyan gifted sri sri Mahaprasthanam Special Edition Book to Trivikram on telangana vimochana day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X