చోటా గబ్బర్ సింగ్‌కు పవన్ కల్యాణ్ కుక్క పిల్ల గిఫ్ట్.. దాని ధర ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల తన అభిమాని కోరికను తీర్చారు. అభిమానుల కోసం తాను ఎంత వరకైనా వస్తానని, వారు తన ఆరో ప్రాణమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. ఇచ్చిన మాట ప్రకారం తన అభిమాని ఇంటికి వెళ్లిన జనసేనాని.. ఆ బాలుడి కళ్లలో ఆనందం చూసి ఎమోషనల్ అయ్యారు. ఇదే సమయంలో అభిమాని కోరిన కోరికను తీరుస్తానని మాటిచ్చి గంట తిరిగేలోగా బహుమతుల్ని ఇంటికి పంపారు పవన్ కళ్యాణ్. ఈ వివరాల్లోకి వెళితే..

హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము- మానసల దంపతుల కుమారుడు నిరంజన్. జన్యుపరంగా అత్యంత అరుదైన నరాల వ్యాదితో బాధపడుతూ కొన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. 17 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఎలాంటి ఎదుగుదల లేక చిన్నపిల్లాడిలాగే కనిపిస్తాడు. ఈ బాబుకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. తన అభిమాన నటుడిని చూడాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. మీడియాతో పాటు తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు. వెంటనే ఆ బాలుడిని చూసేందుకు వస్తున్నట్లు నిరంజన్ కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు.

Pawan Kalyan Gifts Puppy to his Fan Niranjan Do You Know Its Price

జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. తన ఛోటా అభిమానిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. తన ఫేవరెట్ హీరో తన కోసం ఇంటికి రావడంతో ఆ బాలుడు ఎంతో సంతోషించాడు. అనంతరం నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్ధితి, వారి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. తన అభిమాని కోసం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్ధ ప్రసాదాలు తీసుకొచ్చిన పవన్.. బాలుడికి శ్రీవారికి వస్త్రాన్ని కప్పి, కళ్యాణం అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. నిరంజన్ తల్లిదండ్రులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పనిచేసే వారని తెలుసుకున్న జనసేనానని.. వారికి క్యాంటిన్ పెట్టేలా సాయం చేయాలని తెలంగాణ జనసేన నాయకులకు సూచనలు చేశారు.

అయితే నీకేం కావాలని బాలుడిని పవన్ కళ్యాణ్ అడగ్గా.. తనకు ఓ ట్యాబ్.. హీరో రామ్ చరణ్ దగ్గరున్న కుక్కపిల్ల లాంటిది కావాలని చెప్పాడు నిరంజన్. అలాగే ఆ కుక్కపిల్లను పెంచుకోవడానికి ఇంటి ఓనర్ల అనుమతి కావాలని చెప్పాడు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. కుక్క పిల్లను పంపుతానని చెప్పి, ఆ కుక్కపిల్లను పెంచుకోవడానికి ఇంటి ఓనర్లతో స్వయంగా మాట్లాడి అనుమతి ఇప్పించారు. కేవలం గంట వ్యవధిలోనే యాపిల్ ఐపాడ్, కుక్కపిల్లను నిరంజన్ ఇంటికి పంపించారు పవన్ కళ్యాణ్. ఆ రెండు బహుమతులు తన ఇంటికి రాగానే నిరంజన్ ఎంతో సంతోషించాడు.

నాకు ఈ ఐప్యాడ్ పెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఐప్యాడ్ నాకు చాలా చాలా యూజ్ అవుతుందని నిరంజన్ చెప్పాడు. అలాగే రామ్ చరణ్ వద్దనున్న అరుదైన కుక్క పిల్లను కూడా పవన్ కళ్యాణ్ పంపించారు. నిరంజన్ అడిగిన కుక్క పిల్లను వెంటనే తీసుకురావాలని పవన్ ఆదేశించిన వెంటనే జనసేన నేతలు, అభిమానులు వరంగల్‌లోని పెట్స్ షాపులు మొత్తం గాలించి గంటలోపే ఆ కుక్క పిల్లని కొనుగోలు చేశారు. అనంతరం నేరుగా నిరంజన్ ఇంటికి తీసుకెళ్లి ఆ బాలుడికి అందించారు. ఈ కుక్క పిల్ల నచ్చిందా? ఏం పేరు పెడుతున్నావ్? అని జనసేన నాయకులు అడగ్గా.. రెక్స్ అని పేరు పెడుతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీయా.. రెక్స్‌ని జాగ్రత్తగా చూసుకోమని జనసేన నేతలు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే అన్నింటిలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరున్న లాంటి కుక్కపిల్లను పవన్ కళ్యాణ్ తన అభిమానికి గంటలోపే పంపడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుక్కపిల్ల టాయ్ పూడిల్ అనే అరుదైన జాతికి చెందినది. దీనికి చరణ్.. తన పేరు కలిసొచ్చేలా రైమ్ అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బ్రౌన్ కలర్‌లో ఉంగరాల జుట్టుతో, మనుషులకు ఎలాంటి అలర్జీలు కలిగించని అరుదైన జాతి ఈ కుక్కపిల్లది. రామ్ చరణ్ - ఉపాసన ఎక్కడికి వెళ్లినా రైమ్ వారి వెంట ఉండాల్సిందే. దీనికి సంబంధించిన ఫోటోలను వీరిద్దరూ పంచుకుంటూ ఉంటారు. అలాగే ఎస్‌క్వైర్ ఇండియా అనే మ్యాగజైన్ కవర్ పేజ్‌పై రామ్ చరణ్‌తో కలిసి స్థానం దక్కించుకుంది రైమ్. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న అతికొద్ది సెలబ్రిటీ పెట్స్‌లో రైమ్ గుర్తింపు తెచ్చుకుంది.

ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే రైమ్ తరహా కుక్కపిల్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో టాయ్ పూడిల్ కుక్కపిల్ల ఖరీదు.. 70 వేల నుంచి 2,50,000 రూపాయల రేంజ్‌లో ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెంపకందారుడికి మార్కెట్‌లో ఉన్న బ్రాండ్, కేసీఐ రిజిస్ట్రేషన్, కుక్కపిల్ల కలర్ వంటి అంశాలపై ధర ఆధారపడి ఉందని అంటున్నారు. టాయ్ పూడిల్ కుక్క పిల్ల ఖరీదు 70 వేల నుంచి లక్ష రూపాయలు ఉంటే.. కేసీఐ రిజిస్ట్రేషన్ 1,20,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల మధ్యలో ఉంటుంది. వీటిలో అత్యుత్తమ జన్యు లక్షణాలు (ఛాంపియన్ బ్లడ్‌లైన్) ఉన్న టాయ్ పూడిల్ కుక్క పిల్ల ధర అయితే 1,80,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయలు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ టాయ్ పూడిల్ కుక్కపిల్లను పెంచడం కూడా అంత ఆషామాషీ కాదు. నెలవారీ సంరక్షణ, ప్రీమియం ఆహారం, క్రమం తప్పకుండా పెట్ క్లినిక్‌లో చెకప్‌లు, ప్రొఫెషన్ గ్రూమింగ్ నిమిత్తం నెలకు దాదాపు 3 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ బహుమతిగా పంపిన యాపిల్ ఐప్యాడ్ ఖరీదు 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల రేంజ్‌లో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పంపిన బహుమతుల విలువ కంటే .. నిరంజన్ కళ్లలో ఆనందం చూడాలనే తపన, ఆయన మంచి మనసు, అభిమానుల పట్ల పవర్‌స్టార్ చూపించే అప్యాయత, అనురాగం, ప్రేమ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X