అంటే సుందరానికి ఈవెంట్.. పవన్ కోపం.. స్పీచ్ ముగిసిన తరువాత ఆమె కోసం మళ్ళీ వెనక్కి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమాలకు కూడా మద్దతు ఇవ్వడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పవన్ చాలా వరకు సినిమాల కంటే కూడా ఇతర సామాజిక అంశాల పైన ఎక్కువగా మంచి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన అందరి గురించి చాలా చక్కగా మాట్లాడారు. అయితే స్పీచ్ ముగిసిన తర్వాత ఒక నటి కోసం ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మైక్ అందుకొని మాట్లాడారు. ఇక ఏం మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే..
Recommended Video


భారీ సంఖ్యలో అభిమానులు
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఈవెంట్స్ కు వస్తున్నారు అంటే అభిమానులు అందరూ కూడా ఆ వేడుకకు రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అంటే సుందరానికి ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలియగానే అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ కోసం
ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడం నాని సినిమాకు కూడా చాలా హైప్ పెరిగిందనే చెప్పాలి. అంతకు ముందు వరకు కాస్త నార్మల్గానే ఉన్నా బజ్ పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా మారిపోయింది. అసలైతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం రోజు నిర్వహించాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం శుక్రవారం రోజు ప్రత్యేకంగా నిర్వహించాల్సి వచ్చింది.

ఇతర రాష్ట్రాల నుంచి..
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా హీరో నుంచి అలాగే సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ సభ్యులకు సంబంధించిన మంచి విషయాల గురించి పవన్ తెలియజేశాడు. ఒక సినిమా అంటే ఎన్నో విభిన్నమైన అంశాలతో కూడుకున్న పని అని కేవలం ఒక రాష్ట్రానికి చెందినవారు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సినిమాల కోసం పనిచేస్తూ ఉంటారు అని పవన్ తెలియజేశారు.

పవన్ కోపం
ఇక హీరో నాని కోసం కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. అతనికి మా కుటుంబంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు అని పవన్ తెలియజేశారు. ఒకరోజు మా చెల్లెలు నాని సినిమాకు వెళుతున్నాను అని అన్నారు. అలాగే ఈ రోజు నాని సినిమా కాబట్టి తనకు సంబంధించిన ఎలాంటి ఏవీలు వీడియోలను వేయకూడదని నిర్మాతలతో చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా వేశారు. అది నాకు తీవ్రంగా కోపాన్ని తెప్పించింది అని తెలియజేశారు.

ఆమె కోసం మళ్ళీ వెనక్కి..
ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ముగిసిన తర్వాత అనుకోకుండా ఒకరి గురించి మాట్లాడడం మర్చిపోయారు. ఆమె మరెవరో కాదు నానికి మంచి స్నేహితురాలు అయిన నివేద థామస్. వాకీల్ సాబ్ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ తో మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అందరి గురించి మాట్లాడిన తర్వాత ఆమె గురించి మాట్లాడలేదు అని వెంటనే మళ్ళీ మైక్ అందుకనే క్షమించాలి అంటూ ఆమె చాలా మంచి యాక్టర్ అని భవిష్యత్తులో కూడా మంచి నటిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వివరణ ఇవ్వడం నివేదాథామస్ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది.


Click it and Unblock the Notifications











