Hari Hara Veera Mallu Power Glance: మల్ల యోధుడిని ఎత్తి పడేసిన పవన్ కళ్యాణ్.. తొడగొడుతూ..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు క్రిష్ సినిమాకు సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో అంచనాలను పెంచేసాడు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లాన్స్ అనే మరొక టీజర్ను విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అభిమానుల్లో భారీ అంచనాలు
పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ మొత్తంలో కూడా ఇప్పటివరకు ఒక చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలు చేసింది లేదు. మొదటిసారి విలక్షణమైన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అలాంటి కథను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం నెలకొంది. ఇక మొత్తానికి ప్రతి అప్డేట్ తో కూడా చిత్ర యూనిట్ సభ్యులు అంచనాల స్థాయిని పెంచుతున్నారు.

అలాంటి అంశాలతో..
చారిత్రాత్మక అంశాలు ఈ సినిమాలో చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చార్మినార్ గండికోట వంటి ఎన్నో ఐకానిక్ ప్రదేశాలకు సంబంధించిన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భాగ్యనగరం ప్రతిష్టాపన సమయంలో చోటు చేసుకున్న కొన్ని విభిన్నమైన సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
పవన్ పుట్టినరోజు సందర్భంగా.. టీజర్
మొత్తానికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన టీజర్ను కూడా విడుదల చేశారు. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ అద్భుతంగా ఉంది అని నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ అయితే అందున్నాయి. పవన్ కళ్యాణ్ ఇందులో గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త గెటప్ లో కనిపిస్తూ ఉండడం అలాగే మల్లయోధుడిని ఎత్తి అవతలపడేయడం వంటి అంశాలు హైలైట్ అవుతున్నాయి.

తొడగొడుతూ..
గ్లాన్స్ టీజర్ లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తొడగొడుతూ మరి సవాల్ విసరడం వంటి సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తూ ఉంటే సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ కు తోడుగా ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.

2023 పాన్ ఇండియా రిలీజ్
అసలైతే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అని ఎన్నో రకాల రూమర్లు కూడా అభిమానులను కొత్త కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. అంతేకాకుండా సినిమా నుంచి తప్పుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు ఈ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తప్పకుండా సినిమా 2023 సమ్మర్లో విడుదలవుతుంది అని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక మిగిలిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులోనే కాకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మలయాళం హిందీ కన్నడ తమిళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











